శారీరక దృఢత్వంతోనే లక్ష్య సాధన: తమిళిసై

9 Nov, 2019 05:14 IST|Sakshi

రాయదుర్గం: శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే అనుకున్నది సాధించగలమని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. శుక్రవారం గచ్చిబౌలి శాంతి సరోవర్‌ లోని గ్లోబల్‌ పీస్‌ ఆడిటోరియంలో బ్రహ్మకుమారీస్‌ సంస్థ మహిళా విభాగం ఆధ్వర్యంలో వినూత్నంగా చేపట్టిన హోప్‌–హ్యాపీనెస్‌–హార్మోనీ ప్రాజెక్టును గవర్నర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు.  ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్‌ సంస్థ మహిళా విభా గం చైర్‌పర్సన్‌ రాజయోగిని బీకే చక్రదారి దీదీ, మహిళ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జగదీశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు