నాటి వైఎస్సార్‌ నుంచి నేటి కేసీఆర్‌ వరకు

11 Dec, 2019 08:51 IST|Sakshi

అతిథుల నిలయం.. జ్యోతిభవన్‌

ఆహ్లాదం.. ప్రశాంతం.. రక్షణ.. నిరంతర విద్యుత్‌..

గవర్నర్‌కు ప్రత్యేక బస ఏర్పాట్లు చేసిన ఎన్టీపీసీ

ఇండియన్‌ కాఫీ హౌజ్‌ ద్వారా ప్రత్యేక వంటకా

సాక్షి, గోదావరిఖని (కరీంనగర్‌) : రాష్ట్ర, జాతీయస్థాయి అతిథులకు నిలయంగా , అద్భుతమైన వంటకాలతో ప్రత్యేకతను చాటుకుంటోంది రామగుండం ఎన్టీపీసీ జ్యోతిభవన్‌. 2004లో ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అనేక మంది ప్రముఖులు ఇక్కడి గృహంలోనే బస చేశారు. అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నుంచి నేటి సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో సహా ఈ ప్రాంతానికి పర్యటనకు వస్తే ఇదే అతిథిగృహాన్ని ఎంచుకోవడం విశేషం. తాజాగా సీఎం ప్రత్యేకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి ఈప్రాంతానికి వచ్చిన రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్యరాజన్‌ కూడా ఇదే అతిథి  గృహానికి చేరుMýనారు. మరోసారి ఈ గెస్ట్‌హౌజ్‌ విశిష్టస్థానాన్ని సంపాదించుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం ప్రత్యేకంగా వచ్చే అతిథులు బస చేసేందుకు జ్యోతిభవన్‌ గెస్ట్‌హౌజ్‌ నిర్మించారు. 1986లో అప్పటి డైరెక్టర్‌ వి.సుందరరాజన్‌ గెస్ట్‌హౌజ్‌ను ప్రారంభించారు.

అప్పటి నుంచి నేటి వరకు అతిథుల సేవలో తరిస్తోంది. 2006లో దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈప్రాంత పర్యటనకు వచ్చినపుడు ఇదే గెస్ట్‌హౌజ్‌లో బస చేశారు. ఆతర్వాత 2004లో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఆర్‌వీ సాహి గెస్ట్‌హౌజ్‌లో బస చేశారు. అలాగే 2006లో న్యూజిలాండ్‌కు చెందిన విదేశీయులు ఇదే గెస్ట్‌హౌజ్‌లో విడిది చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌ మదన్‌మోహన్‌ బి లోకూర్‌ 2011లో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇదే గెస్ట్‌హౌజ్‌లో ఆతిథ్యం స్వీకరించారు. ఏపీ హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ పీసీ బోస్‌ 2012లో ఈ ప్రాంతానికి వచ్చారు. అలాగే సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ఏడాదిలో రెండుసార్లు జ్యోతిభవన్‌లో బస చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పరిశీలించడానికి వచ్చిన ముఖ్యమంత్రి ప్రశాంతంగా ఉండే గెస్ట్‌హౌజ్‌లో విశ్రాంతి తీసుకునేందుకు ఎంచుకున్నారు. తాజాగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జ్యోతిభవన్‌లోనే బస చేశారు. 

చదవండి: మేడం వచ్చారు       

భవనం ప్రత్యేకతలు ఇవే..
చుట్టూ పచ్చదనంతో పరుచుకున్న పచ్చిక, విశాలమైన రోడ్లు, కాలుష్యానికి ఆమడదూరంలో గెస్ట్‌హౌజ్‌ నిర్మించడం ప్రత్యేకత సంతరించుకుంది. 1986లో ప్రారంభించిన గెస్ట్‌హౌజ్‌ ఎన్టీపీసీ అతిథుల కోసం కేటాయించారు. అయితే గెస్ట్‌హౌజ్‌ ప్రాంగణం విశాలంగా ఉండడంతోపాటు రాష్ట్ర, కేంద్రాల నుంచి వచ్చే అతిథులు బస చేసేందుకు అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కూడా గెస్ట్‌హౌజ్‌కు సమీపంలోనే ఉండడంతో వీఐపీలు బస చేసేందుకు మరింత అనుకూలంగా మారింది. నిరంతర విద్యుత్‌ సరఫరా, అతిథులను ఒప్పించి మెప్పించే వంటకాలతోపాటు అన్ని ఏర్పాట్లు ఇందులో ఉండడంతో అతిథులు ఈ జ్యోతిభవన్‌లోనే ఉండేందుకు మక్కువ చూపుతు న్నారు.

ఇండియన్‌ కాఫీ హౌజ్‌ ఆతిథ్యం
గెస్ట్‌హౌజ్‌లో బస చేసే వారికోసం ఇండియన్‌ కాఫీ హౌజ్‌ ద్వారా నార్తిండియన్‌ వంటకాలు తయారు చేస్తున్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం అతిథులకు వడ్డించేందుకు ఇండియన్‌ కాఫీ హౌజ్‌ను కాంట్రాక్ట్‌ ద్వారా కేటాయించింది. నార్తిండియన్లతోపాటు తెలంగాణ ప్రాంత అతిథులకు కూడా ఇక్కడి వంటకాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 

మరిన్ని వార్తలు