పార్టీలకతీతంగా పట్టణాభివృద్ధికి కృషి

20 Mar, 2017 18:48 IST|Sakshi
పార్టీలకతీతంగా పట్టణాభివృద్ధికి కృషి
ఆదిలాబాద్‌ కల్చరల్‌ : పార్టీలకతీతంగా పట్టణాభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదివారం మున్సిపల్‌ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అన్ని మతాల మతగురువులతో మంత్రోచ్ఛరణలతో పూజలు చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పట్టణాభివృది్ధకి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
కేసీఆర్‌ జిల్లా పర్యాటనలో భాగంగా విడుదల చేయాల్సి ఉన్న నిధులు ఆయన పర్యాటన రద్దుతో విడుదల  చేస్తున్నట్లు చెప్పారు. అందరం కలిసికట్టుగా పట్టణాభివృది్ధకి  పాటుపడాలని చెప్పారు.మున్సిపల్‌ చైర్‌పర్సన్  రంగినేని మనీశ మాట్లాడుతూ ప్రభుత్వం పట్టణాభివృద్ధికి అన్ని రకాలుగా పాటుపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీనివాస్, మున్సిపల్‌ వైస్‌చైర్మన్ ఫరూక్‌ అహ్మద్, జాయింట్‌ కలెక్టర్‌ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు  అందే శ్రీదేవి, ధోని జ్యోతి,  జహీర్‌రంజానీ, మెస్రం కృష్ణ, బండారి సతీష్, గండ్రత్‌రాజేందర్, బాషం నర్సింగ్, సందపుష్ప,  ప్రకాష్‌ ఉన్నారు.  
 
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు