'సమత' పిల్లలకు ఉచిత విద్య

10 Dec, 2019 14:35 IST|Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: గత నెల 24న లింగాపూర్‌ మండలంలో అత్యాచారం, హత్యకు గురైన దళిత మహిళ సమత ఇద్దరు పిల్లలకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశం లభించింది. లింగాపూర్ పోలీసులు మంగళవారం  ఇచ్చోడ మండల కేంద్రంలోని పాఠశాలలో వారిని చేర్పించారు. సమత పిల్లలకు కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలని ప్రభుత్వమిచ్చిన ఆదేశాల మేరకు.. బాధితురాలి పిల్లలు తగిన విద్యను అభ్యసించేందుకు వీలుగా పోలీసులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. అంతేకాక పోలీస్ డిపార్ట్‌మెంట్‌ తరపున ఆమె పిల్లలకు రూ. 10 వేల నగదు ఇచ్చి ఆర్థిక సహాయం అందజేశారు. 

వివరాల్లోకి వెళితే.. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం నుంచి బతుకుదెరువు కోసం ఆసిఫాబాద్‌ జిల్లాలోని లింగాపూర్‌కు వలస వెళ్లిన ఒక దళిత మహిళపై హత్యాచారం జరిగింది. బుగ్గలు అమ్ముకుని జీవనం సాగించే బాధితురాలు సమత ఎప్పటిలానే బుగ్గలు అమ్ముకునేందుకు బయల్దేరి వెళ్లి.. తిరిగి శవమై కనిపించింది.  ఆమెపై ఒంటిపై గాయాలు ఉండడం.. అనుమానస్పదస్థితిలో మృతి చెందడం, లైంగికదాడి చేయడంతో.. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

చదవండి: ‘సమత’గా పేరు మార్పు: ఎస్పీ

 దారుణం: వివాహితపై అత్యాచారం.. హత్య

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా