ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ పనులు

8 Apr, 2015 03:02 IST|Sakshi
ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ పనులు

 తుర్కపల్లి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్‌కాకతీయ పనులు చేపట్టిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. సోమవారం తుర్కపల్లి మండలంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ తె లంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే ముందుగా వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేయాలని మిషన్ కాకతీయ పనులను చేపట్టిందని తెలిపారు. నియోజకవర్గంలో మిషన్ కాకతీయ పనులను వేగవంతం చేశామని తెలిపారు. పనులు పారదర్శకంగా చేయడానికి అధికారులు కృషి చేయాలని కోరారు. చెరువు మట్టిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.వర్షాలు కురవక ముందే పనులు పూర్తి చేయాలన్నారు.  
 
 గంధమల్ల చెరువును రిజర్వాయర్‌గా మారుస్తాం
 గంధమల్ల చెరువును రిజర్వాయర్‌గా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని ఆయన సానుకూలంగా స్పందిం చారని తెలిపారు. ఫీడర్‌చానల్ ద్వారా చెరువుకు నీళ్లు వచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నామని పేర్కొన్నారు. గంధమల్ల చెరువుకు పైనున్న శామీర్‌పేట, పాములపార్తి చెరువులను కూడా రిజర్వాయర్‌గా మార్చనున్నట్లు వివరించారు. ప్రాణహిత చేవెళ్ల పనులు 2 సంవత్సరాల్లో పూర్తయితే ఆ కాలువల ద్వారానైనా నీళ్లు తీసుకురావొచ్చని అన్నారు.  ఎండాకాలంలో గ్రామాల్లో నీటి సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
 
  కార్యక్రమంలో ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్, వైస్‌ఎంపీపీ పలుగుల ఉమారాణి, ఎంపీటీసీ సభ్యులు కొండం రఘురాములు, తలారి శ్రీనివాస్, బద్దూనాయక్, రాజయ్య, భూక్య అరుణ, కావడి భాగ్యమ్మ, జూపల్లి లక్ష్మీ, భీమార్రి  లక్ష్మీ, సర్పంచ్‌లు దారావత్ హరినాయక్, గోనె ప్రకాశ్, అనుమూల వెంకట్‌రెడ్డి, దాసరి ఎర్ర నర్సింహులు, ఐనాల చైతన్య, మారగోని రమాదేవి, సొక్కుల యేశమ్మ, బబ్బూరి శ్రీనివాస్‌గౌడ్, అరుణ, భాగ్యలక్ష్మి, సరిత, ఎల్లేశ్, అనిత, సర్వూప, ఎంపీడీఓ కృష్ణారెడ్డి, ఈఓపీఆర్‌డీ చంద్రమౌళి, ఆర్‌ఐ చంద్రశేఖర్, కార్యదర్శులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు