ధాన్యం కొనుగోళ్లకు నిబంధనాలు

20 Oct, 2014 00:54 IST|Sakshi

 ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనేవారు లేక ఇప్పటికే దిక్కులు చూస్తున్న రైతులకు ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనలతో తిప్పలు తప్పేలాలేవు. ఐకేపీ కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈఓలు) పరిశీలించి ఓకే అంటేనే కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొనుగోళ్లు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
 
 వలిగొండ
 ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఈ ఏడాది గతంలో లేని కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. ఇప్పటికే ధాన్యం కొనేవారు లేక దిక్కులు చూస్తున్న రైతులకు కొత్త నిబంధనలతో తిప్పలు తప్పేలా లేవు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలోని వివిధ ప్రాం తాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసిన జిల్లా సహకార శాఖ జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు అని పేర్కొంటూ ఈ నెల 16న జీఓ నంబర్ 1719ను జారీ చేశారు. ఈ జీఓ ప్రకారం వ్యవసాయశాఖకు సం బంధించిన విస్తరణ అధికారులు(ఏఈఓ) ధాన్యం పరిశీలించి కొనుగోలు చేయవచ్చునని ధ్రువీకరిస్తే తప్ప ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయరాదని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి నిబంధనలు లేవు. కానీ కొనుగోలు కేంద్రంలోని సంబంధిత అధికారులు ధాన్యం పరిశీలించి కొనుగోలు చేసేవారు.

 కొనుగోళ్లు మరింత ఆలస్యం..
 మారిన నిబంధనలతో కొనుగోళ్లు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కని పిస్తోంది. ఏఈఓలు మండలానికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉన్నా రు. వీరు ప్రతి రోజు మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం పరిశీలించడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏఈఓలు వచ్చి ధాన్యం పరిశీలించే వరకు ఆగాల్సి వస్తే రోజుకు ఎన్ని బస్తాల ధాన్యం కొనుగోలు చేయగలుగుతారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు