25 ఏళ్లుగా ఏకగ్రీవమే..

19 Jan, 2019 09:32 IST|Sakshi
చినమునిగల్‌ గ్రామం

ఆదర్శంగా నిలుస్తున్న చిన్నమునిగల్‌ తండా

ప్రభుత్వ ప్రోత్సాహంతో తండాలో అభివృద్ధి

చందంపేట : కృష్ణమ్మ ఒడ్డున ఉన్న ఓ తండా ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. తండా అభివృద్ధికి స్థానికులు 25 ఏళ్లుగా ఏకతాటిపై నిలుస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసుకుంటూ ప్రభుత్వ నజరానాతో అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు చిన్నమునిగల్‌తండా వాసులు. నల్లగొండ జిల్లాలోనే మారుమూలన ఉండే ఈ తండా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో ఏలేశ్వరం వద్ద ఉన్న భూములను కోల్పోవడంతో పునరావాసం కింద పెద్దమునిగల్‌ గ్రామం పక్కనే ఉన్న ఓ స్థలాన్ని చిన్నమునిగల్‌గా ఏర్పాటు చేశారు.

25 ఏళ్లుగా ఈ తండాలో సర్పంచ్, వార్డులు ఏకగ్రీవమవుతున్నాయి. గతంలో చిన్నమునిగల్‌ గ్రామపంచాయతీలో గతంలో బుగ్గతండా, వైజాక్‌కాలనీ ఉండేవి. ప్రస్తుతం 500 జనాభా పైబడిన తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో బుగ్గతండా, వైజాక్‌కాలనీ నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం 250 ఓట్లతో చినమునిగల్‌ గ్రామపంచాయతీగా ఉంది. ఇప్పుడు కూడా పంచా యతీ ఏకగ్రీవమయ్యింది. అప్పటి నుంచి రాజేశ్వర్, మైసానమ్మ, పాపానాయక్, మకట్‌లాల్‌ ఏకగ్రీవ సర్పంచ్‌లుగా పని చేశారు. ఈ సారి కేతావత్‌ జంకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

ఏకగ్రీవానికే తండావాసుల మొగ్గు..
గత ఎన్నికల్లో మకట్‌లాల్‌ ఏకగ్రీవం కావడంలో రూ.10లక్షల నజరానా అందడంతో గ్రామంలో సీ సీ రోడ్ల కోసం ఉపయోగపడ్డాయని గ్రామానికి చెందిన దేవరకొండ నగరపంచాయతీ మాజీ చై ర్మన్‌ మంజ్యానాయక్, వ్యాపారవేత్త రూప్లానా యక్‌ తండా వాసులకు వివరించారు. దీంతో ఈ సారి కూడా ఏకగ్రీవం వైపే మొగ్గు చూపారు. ప్యా రిస్‌లో ఎంబీఏ చేసిన మంజ్యానాయక్‌ కుమారు డు ఈ సారి ఏకగ్రీవ ఉప సర్పంచ్‌గా ఎన్నికై గ్రామ అభివృద్ధిగా కృషి చేస్తానని పేర్కొంటున్నాడు.

ఏకగ్రీవం అయితేనే అభివృద్ధి సాధ్యం 
అందరి ప్రోత్సాహంతో నేను ఈ సారి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా ను. గతంలో నాలుగుసార్లు మా గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. నన్ను ఎ న్నుకున్నందుకు గ్రామస్తులకు కృతజ్ఞతలు. గ్రామాభివృద్ధి కోసం నా శాయశక్తులా కృషి చేస్తా. – కేతావత్‌ జంకు, సర్పంచ్, చిన్నమునిగల్‌

గ్రామాభివృద్ధే ధ్యేయం 
మారుమూల గ్రామమైన చిన్నమునిగల్‌ను అభివృద్ధి చేయడానికి ప్యారి స్‌లో ఎంబీఏ చేసిన నేను ఈ సారి బరిలో నిలబడ్డా. తండావారంతా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందరికీ మంచి జరగాలన్నదే నా ఉద్దేశం. ప్రజలకు అందుబాటులో వారి సమస్యలు పరిష్కరిస్తా.  – కేతావత్‌ లాలునాయక్, ఉప సర్పంచ్, చిన్నమునిగల్‌
 

మరిన్ని వార్తలు