గ్రామపంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం 

13 Sep, 2019 02:45 IST|Sakshi
స్రవంతిని  జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తున్న గ్రామస్తులు

పని ఒత్తిడే కారణం

కార్యాలయంలోనే పురుగుల మందు తాగిన మహిళా కార్యదర్శి

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘటన  

నాగర్‌కర్నూల్‌/జడ్చర్ల టౌన్‌: పనిఒత్తిడి తట్టుకోలేక జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే  మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం చిన్నపల్లి గ్రామ జూనియర్‌ కార్యదర్శి ప్రత్యూష ఉద్యోగానికి రాజీనామా చేయగా, గురువారం నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మా జిపేట మండలం గుమ్మకొండ జూని యర్‌ కార్యదర్శి స్రవంతి ఆత్మహత్యకు యత్నించింది. ‘30 రోజుల ప్రణాళిక’లో భాగంగా గురువారం తిమ్మాజిపేట మండలం గుమ్మకొండలో బడ్జెట్‌పై గ్రామసభ నిర్వహించారు. సభ ముగిశాక  స్రవంతి కార్యాలయంలోనే పురుగుల మందు తాగింది. వెంటనే స్థానికులు స్రవంతిని తిమ్మాజిపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో  హైదరాబాద్‌కు తరలించారు. స్రవంతి స్వస్థలం నాగర్‌కర్నూల్‌. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త ఏడు నెలల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

మరిన్ని వార్తలు