పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

24 Jul, 2018 12:30 IST|Sakshi
రూరల్‌: వినతి పత్రం ఇస్తున్న కార్మికులు

నారాయణపేట రూరల్‌: గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ వర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఐఎఫ్‌టీయూ జిల్లా కోషాధికారి నర్సింహులు, జిల్లాఉపాధ్యక్షుడు బలరాం డిమాం డ్‌ చేశారు. 23 నుంచి నిర్వహించ తలపెట్టిన సమ్మెపై సోమవారం ఎంపీడీఓ వెంకటయ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమాల్లో వెంకటయ్య, బాల్‌రెడ్డి, కృష్ణయ్య, రాజు, అశోక్, నర్సింహులు, కిష్టప్ప, దస్తప్ప పాల్గొన్నారు.

  ధన్వాడ: పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బల్‌రాం డిమాండ్‌ చేశారు.   కార్మికులు సమ్మెకు దిగారు.  ఇందులో కారోబార్‌ కృష్ణయ్య, బాలక్రిష్ణ, కృష్ణహరి, నూరోద్దిన్, తిప్ప య్య, తిరుపతమ్మ, బాల్‌నర్సింహులు, ఇసుఫ్, చంద్రయ్య, వెంకటయ్య, పెంటమ్మ, లక్ష్మిమ్మ, సునిత, బాలయ్య పాల్గొన్నారు.

దామరగిద్ద: పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం అమలు చేసి వారి సమస్యలను పరిస్కరించాలని సీపీఎం నాయకులు గోపాల్‌ అన్నారు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోసీఐటీయూ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాస్త సమ్మేలో భాగంగా ధర్నా నిర్వహించారు. జోషి, భీమేష్, కార్మికులు  వెంకటప్ప, మోహన్,  లింగప్ప, శణప్ప, ఊషప్ప,  ఎల్లప్ప, వెంకటేష్, చెన్నప్ప, తదిరులు పాల్గొన్నారు.  
మరికల్‌: పంచాయతీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల సర్వీసును రెగ్యులరైజ్‌ చేయాలని కార్మికులు కోరారు. సోమవారం డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాసులుకు వినతి పత్రానిచ్చారు. పంచాయితీ కార్యదర్శి పోస్టులను అర్హులైన ఉద్యోగ, కార్మికుల నుంచి భర్తీచేయాలని పేర్కొన్నారు.  రాములు, శ్రీనివాసులు, వెంకటమ్మ పాల్గొన్నారు.

 
కోయిల్‌కొండ: కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని ఐఎఫ్‌టీయూ అధ్యక్షుడు నర్సింహులు అన్నారు. కార్మికులతో కలిసి వివేకానంద చౌరస్తా నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం నిరసన తెలిపారు. చెన్నయ్య, గోపాల్, నారాయణ, రవి, బాలకిష్టయ్య, గాఫర్, బుచ్చమ్మ, అంజిలమ్మ, నాగమ్మ, లక్ష్మీమ్మ, కనకయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు