మహాకూటమి ఓ 'విష'కూటమి

16 Nov, 2018 10:56 IST|Sakshi
మాట్లాడుతున్న గంగుల కమలాకర్‌

టీఆర్‌ఎస్‌ పాలనలోనే ప్రజలకు ఊరట

ఆర్‌ఎస్‌ అభ్యర్ధి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌అర్బన్‌: టీఆర్‌ఎస్‌ పాలనలోనే తెలంగాణ ప్రజలకు ఊరట లభించిందని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ అన్నారు.  3వ డివిజన్‌లో గురువారం నిర్వహించిన మహిళల ఆశీర్వాద సభలో మాట్లాడారు. తెలంగాణ చెట్టు ఫలాలను పొందాలంటే మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలన్నారు. మేయర్‌ రవీందర్‌సింగ్, నాయకులు ఎడ్ల ఆశోక్, ఆర్ష మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అలాగే సాయంత్రం 27, 30 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్పొరేటర్లు కోడూరి రవీందర్‌గౌడ్, చొప్పరి జయశ్రీ వేణు, నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు.  

మహాకూటమి గెలిస్తే అధోగతే..
కొత్తపల్లి: కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి ఓ విషకూటమని, కూటమి గెలిస్తే తెలంగాణ అధోగతి పాలు కాకతప్పదని కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. కొత్తపల్లి మండలం చింతకుంట శాంతినగర్‌లో గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఆయనకు స్థానికులు బ్రహ్మరథం పడుతూ స్వాగతించారు. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, ఎంపీపీ వాసాల రమేశ్, డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్, నాయకులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా యాదవ సంఘ భవనంలో గంగులను గొర్రె గొంగళితో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 

టీఆర్‌ఎస్‌లో చేరిక
కరీంనగర్‌: మీసేవ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ సమక్షంలో జేఏసీ, బీసీ సంఘం నాయకులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో బొల్లం లింగమూర్తి, బిజిగిరి నవీన్‌కుమార్, బొల్లం రాజ్‌కుమార్, కొట్టె కిరణ్, పల్లె నారాయణగౌడ్‌ తదితరులున్నారు. డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్లు కట్ల సతీశ్, చల్ల హరిశంకర్, బోనాల శ్రీకాంత్, డిష్‌ మధు, కుమార్, మహేందర్, సత్యనారాయణ, ఉదారపు మారుతి, తోట మధు, శంకర్, మిర్యాల్‌కార్‌ నరేందర్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు