మనవడి ని పెళ్లి కొడుకును చేసి...

6 Feb, 2015 18:50 IST|Sakshi
మనవడి ని పెళ్లి కొడుకును చేసి...

ముషీరాబాద్: అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవడు పెళ్లికొడుకయ్యాడు. అతడిని తనివి తీరా చూసుకొని.. నిండు మనసుతో దీవించిన ఆమె సంతోషం పట్టలేకో ఏమో... అంతలోనే అనంతలోకాలకు వెళ్లి పోయింది. దీంతో ఆ పెళ్లి మండపంలో మోగాల్సిన భాజాభంత్రీలు మూగబోయాయి. పెళ్లిని తాత్కాలికంగా నిలిపి వేసి అమ్మమ్మ అంత్యక్రియలను నిర్వహించారు. వివరాలు.. ముషీరాబాద్‌లోని సాయిరెడ్డి పటేల్‌నగర్ అందరికీ సుపరిచితం. 1950కు ముందు ఆ ప్రాంతంలో సాయిరెడ్డిపటేల్  పెద్ద భూస్వామి. అతనికి చెందిన భూములే రాంనగర్, అడిక్‌మెట్ తదితర ప్రాంతాలు. అతను మృతి చెందాక అతను ఉండే వీధిని సాయిరెడ్డి పటేల్‌నగర్‌గా పిలుస్తున్నారు. అతని ము నిమనవడు సందీప్‌రెడ్డి వివాహం - మేఘనతో  గురువారం ఉదయం 11 గంటలకు కొంపల్లిలో జరగాల్సి ఉంది.

 

అయితే వివాహానికి ముందు బుధవారం రాత్రి సందీప్‌రెడ్డిని అతడు నివసించే అల్వాల్‌లో పెళ్లి కొడుకును చేశారు. ఈ వేడుకకు సాయిరెడ్డిపటేల్ కొడుకు రాంచంద్రారెడ్డి భార్య దేవేంద్రమ్మ ముషీరాబాద్ నుంచి వచ్చారు. మనువడిని పెళ్లి కొడుకును చేయగా చూసి మనసారా దీవించింది. కొద్దిసేపటికే అక్కడే కన్ను మూసింది.  దీంతో వివాహాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.  భౌతిక కాయాన్ని ముషీరాబాద్‌కు తీసుకొచ్చి బాపూజీనగర్ శ్మశాన వాటికలో నిర్వహిం చారు. దీంతో సాయిరెడ్డిపటేల్ గల్లీతో పాటు ముషీరాబాద్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాళ్ల గుట్టల్ని కూడా వదలరా?

కారు డోర్‌లాక్‌ పడి.. ఊపిరాడక

పన్ను వసూళ్లలో భేష్‌

నోటిఫికేషన్‌ వెలువడే వరకు ఓటర్ల జాబితా సవరణ

ముస్లింలకు స్వర్ణయుగం

హ్యాపీ బర్త్‌డే కేటీఆర్‌

గుర్తింపు లేని కాలేజీలు.. 1,338

ఇంటర్‌ ఫస్టియర్‌లో 28.29% ఉత్తీర్ణత

అసెంబ్లీ భవనాలు సరిపోవా?

మిషన్‌ కాకతీయకు అంతర్జాతీయ గుర్తింపు 

పట్నం దిక్కుకు 

దుక్కుల్లేని పల్లెలు

ఆమె కోసం.. ఆ రోజు కోసం!

..ఇదీ మెడి‘సీన్‌’

ఎనిమిది వర్సిటీలకు ఇంఛార్జ్ వీసీలు

‘అందుకే కలెక్టర్లకు విశేషాధికారాలు’

ఈనాటి ముఖ్యాంశాలు

అక్బరుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

ఉన్న అసెంబ్లీని కాదని కొత్త భవనం ఎందుకు?

కేంద్రమంత్రి హామీ ఇచ్చారు: కోమటిరెడ్డి

కేసీఆర్‌ గారూ! మీరు తెలంగాణాకు ముఖ్యమంత్రి..

‘బిగ్‌బాస్‌’కు ఊరట

ఉన్నతాధికారిని చెప్పుతో కొట్టిన మహిళా ఉద్యోగి

ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగాన్ని మూసేయాలి..

కుళ్లిన మాంసం.. పాడైపోయిన కూరలు

ఆకాశంలో సైకిల్‌ సవారీ

రయ్‌.. రయ్‌

విద్యార్థినిపై హత్యాయత్నం

వచ్చిరాని వైద్యం.. ఆపై నిలువు దోపిడీ 

ఎంజాయ్‌ ఏమాయె!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌ @ 800

ఆపరేషన్‌ సక్సెస్‌

వందలో ఒక్కరు!

జ్ఞాపకశక్తి కోల్పోయా

హ్యాట్రిక్‌కి రెడీ

సున్నితమైన ప్రేమకథ