అందరికీ సమన్యాయం

26 Dec, 2014 03:27 IST|Sakshi
అందరికీ సమన్యాయం

క్రిస్మస్ వేడుకలో మంత్రి పోచారం
 
నిజామాబాద్ కల్చరల్: తమ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు సముచిత న్యాయం చేసే దిశగా ముందుకు సాగుతోందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌లో ఉన్న సీఎస్‌ఐ చర్చిలో గురువారం జరిగిన క్రిస్మస్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. కేక్ కట్ చేసి చర్చి ఫాస్టర్ ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్ తదితరులకు తినిపించారు.

అనంతరం మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించుకోవాలనే సదాశయంతో రూ.10 కోట్లతో క్రైస్తవభవన్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. చర్చీల మరమ్మతులు, ఇతర సౌకర్యాలకు కుడా తగు ప్రాధాన్యతనిస్తామన్నారు. క్రైస్తవుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, నగర మేయర్ ఆకుల సుజాత, జడ్‌పీ చెర్మైన్ దఫేదార్ రాజు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వీరందరిని చర్చి నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. తరువాత చర్చి ఆవరణలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నారులు బైబిల్ పఠనం చేశారు. కా్రం  గెస్ అర్బన్ ఇన్‌చార్జి బి.మహేశ్‌కుమార్‌గౌడ్, మహి  ళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత చర్చిని సందర్శించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

నగరంలోని సుభాష్‌నగర్ నిర్మల హృదయ కళాశాల ప్రాంగణంలోని సెయింట్ ఆన్స్ చర్చి, ఎన్‌జీఓస్ కాలనీలోని గ్లోరియస్ చర్చి, ఎల్లమ్మగుట్ట, తారక రామారావునగర్‌లోని వీపీఎం చర్చి, ఆక్స్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి, ఆర్మూరు, బాల్కొండ, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, బోధన్ తదితర ప్రాంతాలలోనూ క్రిస్మస్ పండుగను శోభాయమానంగా జరుపుకున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా