నల్లమలలో నాటు బాంబులు!

2 Dec, 2014 00:37 IST|Sakshi

దేవరకొండ: నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లి గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు దాచి ఉంచిన 59 నాటు బాంబులను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం... మోద్గులబొంద సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు బండరాళ్ల సందులో ప్లాస్టిక్ బకెట్లలో దాచి ఉంచిన ఈ బాంబుల సమాచారం తమకు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిందన్నారు.  

దీంతో ఐడీ పార్టీ, స్పెషల్ పార్టీలతో వెళ్లి బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పొటాషియం, గంధకం, డిటోనేటర్లతో తయారు చేసిన ఈ బాంబులు ప్రమాదకరమైనవని, వీటిని ఎక్కువగా ఫ్యాక్షన్ సంస్కృతి ఉన్న ప్రాంతాల్లో ఉపయోగిస్తారని,  వీటిని పోలీస్ పరిభాషలో డర్టీ బాంబులుగా అభివర్ణిస్తారని తెలిపారు.

వీటిని గుంటూరు జిల్లా నుంచి ఇక్కడికి తరలించి ఉండొచ్చన్నారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ వెంకటయ్య, చందంపేట ఎస్‌ఐ నాగభూషణ్‌రావు, ఈ రెండు బృందాల పోలీసులు వెంకట్‌రెడ్డి, విజయ్‌శేఖర్, రాంప్రసాద్‌లను డీఎస్పీ అభినందించారు.

మరిన్ని వార్తలు