నాబార్‌‌డ కృషి అభినందనీయం

10 Jul, 2014 04:05 IST|Sakshi
నాబార్‌‌డ కృషి అభినందనీయం

కలెక్టరేట్ : జిల్లాలో గ్రామీణాభివృద్ధికి, పల్లె ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో నాబార్డ్ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ జి.కిషన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నాబార్డ్ 33వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా వివిధ రంగాల అభివృద్ధికి కృషిచేసిన బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు, రైతు క్లబ్‌లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.
 
అనంతరం నాబార్డ్ ఏజీఎం ఉదయ్‌భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో నాబార్డ్ ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్‌ఐడీఎఫ్(రూ.480కోట్లు) అమలవుతోందని, ఇందులో అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామీణ గిడ్డంగులు, రోడ్లు, వంతెనల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఏటూరునాగారం, తాడ్వాయి, మరిపెడ మండలాల్లో సుమారు *2.50కోట్లతో తోటలు పెంచుతున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్ డీజీఎం ధనుంజయ్, డీఆర్‌డీఏ పీడీ శంకరయ్య, ఏడీఎం.సాయిప్రసాద్, ఉమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
డీసీసీబీకి నాబార్డ్ అవార్డు
హన్మకొండ సిటీ : ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందించినందుకు డీసీసీబీ నాబార్డ్ అవార్డుకు ఎంపికయింది. కలెక్టర్ చేతుల మీదుగా డీసీసీబీ జనరల్ మేనేజర్ వి.సురేం దర్ అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. డీసీసీబీ 31 ఏళ్ల తరువాత రూ.1.37 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది రైతులకు రూ.330 కోట్ల రుణాలందించింది. రూ.124కోట్ల డిపాజిట్ సేకరించి, జిల్లాలో మల్టీపర్పస్ బిజినెస్ కింద 26 గోదాంలు నిర్మించిందని మేనేజర్ సురేందర్ చెప్పారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా