ఘనంగా సినారె జయంతి ఉత్సవాలు

30 Jul, 2018 09:29 IST|Sakshi
సినారె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కవులు  

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ఆదివారం సిద్దిపేట పట్ట ణంలోని స్థానిక కేంద్ర గ్రంథాలయంలో సాహితీ దిగ్గజం జ్ఞానపీట్‌Š‡ అవార్డు గ్రహీత కీ.శే.డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సినారె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు, అనంతరం, సినారె స్మృతులను నేమరువేసుకున్నారు. ఈ సందర్భంగా కథాశిల్పి ఐతాచంద్రయ్య మాట్లాడుతూ.. లయబద్ధమైన గేయాలతో మదికియింపైన రచయితగా సినారెకు గొప్ప పేరు ఉందని అన్నారు.

ప్రముఖ కవి అంజయ్య మాట్లాడుతూ.. కలం పట్టి రచనలు ప్రారంభించిన నాటి నుంచి మరణించే వరకు కలం ఆపని మహానీయుడు సినారె అని పొగిడారు. నేడు సినారె లేకున్నా ఆయన రచనలు ప్రజల్లో సాహితీలోకంలో అనునిత్యం పాఠిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. సినీజగత్తులో మరుపురాని పాటల తో మదిన నిలిచారని అన్నారు. కవి ఉండ్రాళ్ల రాజేశం మాట్లాడుతూ.. పల్లెటూరిలో పుట్టి మట్టి పరిమళత్వం పంచి పెట్టిన కవి సినారె అన్నారు.

తన వద్దకు వచ్చిన కవులను ఆదరించి వారికి మెళకువలు నేర్పిన గొప్ప వ్యక్తి సినారె అని పేర్కొన్నారు. కార్యక్రమంలో దాసరి రాజు, ఎన్నవెళ్లి రాజమౌలి, పెందోట వెంకటేశ్వర్లు, కోణం పర్శరాములు, జస్వరాజ్‌కుమార్, శ్రీచరణ్‌ సాయిదాస్, మిట్టపల్లి పర్శరాములు, భరత్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు