ప్రత్యేక మెడికల్ ప్రవేశ పరీక్షకు గ్రీన్‌సిగ్నల్!

30 Apr, 2015 01:59 IST|Sakshi

హైదరాబాద్: ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు సుముఖంగా ఉంది. తామే ప్రవేశ పరీక్ష నిర్వహించుకుంటామని..అందుకు అనుమతించాలని తెలంగాణ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీ మేనేజ్‌మెంట్ల సంఘం కోరుతున్న నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో ఆ పరీక్ష ఉండేలా చూడాలని యోచిస్తున్నాయి. ఈ విషయంపై గురువారం ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి లక్ష్మారెడ్డి సమావేశం కానున్నారు. ఇదిలావుండగా ‘బి’ కేటగిరీ 10 శాతం సీట్లను, ‘సి’ కేటగిరీ 40 శాతం సీట్లతో తామే భర్తీ చేసుకుంటామని కూడా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కోరుతున్నాయి. వీటన్నింటికీ ఒకే ఏకీకృత ఫీజు రూ. 11 లక్షలు వసూలు చేసుకునేలా అనుమతించాలని కూడా యాజమాన్యాలు కోరుతున్నాయి.

మరిన్ని వార్తలు