పచ్చని ఒడి.. సర్కారు బడి

10 Nov, 2018 13:59 IST|Sakshi
తరగతి గదుల ముందు ..

     చలకుర్తి పాఠశాలలో పరుచుకున్న పచ్చదనం

     మొక్కలను నాటి సంరక్షిస్తున్న వైనం

     ఆదర్శంగా నిలుస్తున్న పాఠశాల 

సాక్షి,పెద్దవూర : పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే ఎవరికైనా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్ఛమైన పైరగాలి వీస్తుంటే పచ్చదనం పందిళ్ల మధ్యలో ప్రకృతిని ఆస్వాదిస్తూ పాఠాలను నేర్చుకోవడం ఎవరికైనా ఇష్టమే. పాఠశాలల్లో ఇలాంటి వాతావరణమే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మొక్కలు పెట్టినట్లుగా ఫొటోలకు ఫోజిచ్చి మరుసటి నాటినుంచి వాటి సంరక్షణను పూర్తిగా మరిచిపోతున్నారు అధికారులు. దీంతో నాటిన మొక్కలు నాటినట్లుగానే ఎండిపోతున్నా యి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న నినాదంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ వన నర్సరీలను ఏర్పాటు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుంది.

లెక్కల్లో మాత్రం ఈ సంవత్సరం ఇన్ని లక్షల మొక్కలు నాటాము అని గొప్పలు చెప్పుకుంటూ చేతులు దులుపుకోవడం తప్ప ఆచరణలో మాత్రం అమలుకు నోచుకో వడం లేదు. ఒక మంచి పనిని పక్క వ్యక్తితో చే యించాలంటే ఆ పని తాను చేసి చూపించి ఆదర్శవంతంగా ఉంటేనే ఆ పని విజయవంతం అవుతుందనే విషయాన్ని నమ్మి ఆచరణలో పెట్టారు మండలంలోని చలకుర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం త్రిపురనేని లక్ష్మీప్రభ. అలాంటి వా తావరణాన్ని కోరుకోవడటమే కాదు దానిని సాకా రం చేసుకుని ఆస్వాదిస్తున్నారు విద్యార్థులు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పాఠశాల ఆవరణను పచ్చదనంతో నింపారు. నాటిన  మొక్కలను విద్యార్థులు దత్తత తీసుకుని వాటిని సంరక్షించారు. గత నాలుగేళ్లుగా హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలు పెరిగి పెద్దవై నీడను ఇవ్వడంతో పాటు పచ్చదనం పర్చుకుంది. 
రకరకాల మొక్కలు
పాఠశాల ఆవరణలో హెచ్‌ఎం లక్ష్మీప్రభ, ఉపాధ్యాయులు ఔషద మొక్కలు, పూల మొక్కలు గాని కనిపిస్తే చాలు వాటిని కొనుగోలు చేసి పాఠశాలకు తీసుకువచ్చి వాటిని విద్యార్థులచే నాటిం చి విద్యార్థులకు దత్తత ఇస్తుంటారు. నాటిన మొక్కలను సైతం ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ గావిస్తూ సంరక్షిస్తుంటారు.  

ఇష్టంతో పెంచుతున్నా ..
మేడంలు, సార్లు మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పటంతో ప్రతి ఒక్కరము తలా రెండు మొక్కలను దత్తత తీసుకున్నాము. ఒకరికి ఒకరు పోటీపడుతూ పాఠశాల సెలవుదినాలలోనూ స్కూలుకు వచ్చి మొక్కలకు నీటిని పోసి పెంచుతున్నాము. ఇప్పుడు నేను పెంచుతున్న మొక్కలు చెట్లు అయ్యాయి. 

– బూరుగు అనూష, 4వ తరగతి విద్యార్థిని 

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.. 
మొక్కలు నాటి వాటిని పెంచడంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి వాటి సంరక్షణను విద్యార్థులకు అప్పగించాము. నిత్యం వారికి సలహాలు ఇస్తూ విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచుతూ మొక్కలను సంరక్షిస్తున్నాము. 


– కె.నాగరాజు, ఉపాధ్యాయుడు 

ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నాం.. 
పచ్చదనం అంటే నాకు ఎంతో ఇష్టం. పాఠశాలను పచ్చదనంతో నింపాలని అనుకున్నాను. హరితహారంలో భాగంగా నీడనిచ్చే కొన్ని మొక్కలను నాటాము. పూలమొక్కలు, పండ్ల మొక్కలు, ఔషద మొక్కలను బయటినుంచి కొనుగోలు చేసి నాటించాను. 


– త్రిపురనేని లక్ష్మీప్రభ, హెచ్‌ఎం, పీఎస్‌ చలకుర్తి 

మరిన్ని వార్తలు