గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభజన పూర్తి: రాజీవ్ త్రివేది

6 Jun, 2014 04:34 IST|Sakshi

* తెలంగాణ ఆక్టోపస్ ఇన్‌చార్జిగా అదనపు డీజీ రాజీవ్ త్రివేది
* గ్రేహౌండ్స్ ఐజీగా మహేష్ భగవత్ బాధ్యతల స్వీకరణ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన యాంటీ నక్సలైట్ కమాండో విభాగం గ్రేహౌండ్స్‌తో పాటు రాష్ట్ర యాంటీ టైస్ట్ కమాండో విభాగం ఆక్టోపస్ రెండుగా విడిపోయాయి. తెలంగాణ రాష్ట్ర గ్రేహౌండ్స్ ఇన్‌చార్జిగా రాష్ట్ర స్పెషల్ బెటాలియన్ అదనపు డీజీ రాజీవ్‌త్రివేది గురువారం బాధ్యతలను స్వీకరించారు.
 
 అలాగే ఆక్టోపస్ ఐజీగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఐజీ మహేష్ మురళీధర్ భగవత్ బాధ్యతలను చేపట్టారు. గ్రేహౌండ్స్‌కు సంబంధించి కీలకమైన కమాండోలను రెండు రాష్ట్రాలకు విభజించారు. తెలంగాణకు కొంత తక్కువగా కేటాయింపు జరిగినా వచ్చే రెండు, మూడు నెలల్లో గ్రేహౌండ్స్‌కు అవసరమైన సిబ్బందిని సమకూర్చుతారని ఉన్నతాధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు