పాలరాపు గుట్టల్లో గ్రిఫెన్‌ రాబందులు

27 Dec, 2018 02:50 IST|Sakshi

పెంచికల్‌పేట్‌ (సిర్పూర్‌): కుమురంభీం జిల్లా పెంచికల్‌పేట మండలంలోని ప్రాణహిత, పెద్దవాగు సంగమ ప్రాంతంలోని నందిగామ వద్ద గల పాలరాపు గుట్టల్లోకి రెండు గ్రిఫెన్‌ రాబందులు వలస వచ్చాయి. ఇక్కడున్న పొడుగు ముక్కు రాబందుల సంరక్షణ కేంద్రంలో భిన్నంగా ఉన్న రెండు రాబందులను గుర్తించి ఉన్నతాధికారులకు వాటి ఫొటోలను పంపారు. వాటిని హిమాలయ పర్వతశ్రేణిలో నివాసం ఉండే హిమాలయన్‌ గ్రిఫెన్‌ రాబందులుగా గుర్తించినట్లు కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో రాజారమణ రెడ్డి తెలిపారు.

ఏటా శీతాకాలంలో నార్త్‌ ఇండియా హిమాలయాల నుంచి దక్షిణ భారతదేశంలోని కేరళ, కర్ణాటక, ఏపీలోని కోస్తా ప్రాంతాలకు రాబందులు వలస వస్తుంటాయని అధికారులు తెలిపారు. కానీ తొలిసారిగా రాష్ట్రంలోని పాలరాపు గుట్ట వద్ద స్థావ రం ఏర్పరుచుకున్నాయని వివరించారు. ఇవి పొడుగుముక్కు రాబందుల కంటే పెద్దగా ఉన్నాయని, రోజూ వాటి దినచర్యను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు