స్విచ్చేస్తే షాక్!

10 Feb, 2015 01:25 IST|Sakshi
స్విచ్చేస్తే షాక్!

త్వరలో పెరగనున్న విద్యుత్ చార్జీలు!
 
5.75 శాతం పెంచాలని ఎన్‌పీడీసీఎల్ ప్రతిపాదన
గృహ వినియోగదారులకు 100 యూనిట్ల వరకు వెసులుబాటు
సామాన్యులకు భారం తగ్గించే యోచనలో సర్కారు

 
హన్మకొండ :  విద్యుత్ చార్జీల మోత మోగనుంది. వినియోగదారులపై వడ్డ న తప్పేట్టుగా లేదు. ఆదాయ, వ్యయూలను బేరీజు వేసుకున్న ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్) విద్యుత్ చార్జీలు పెంచాలని నిర్ణరుుంచింది. ఈ మేరకు చార్జీల పెంపు ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్‌కు ఎన్‌పీడీసీల్ సమర్పించింది. ప్రస్తుతం ఉన్న చార్జీలపై 5.75 శాతం పెంచుతూ ప్రతిపాదన లు ఈఆర్‌సీకి సమర్పించినట్లు సమాచారం. చార్జీల పెంపు అంశాన్ని ఎన్‌పీడీసీఎల్ అధికారులు బహిర్గతం చేయడం లేదు. కాగా, పెరిగే విద్యుత్ చార్జీలు ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
 
నెలకు రూ.3 కోట్ల భారం


 జిల్లాలో ప్రస్తుతం ప్రతి నెల దాదాపు  వినియోగదారులు బిల్లులు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చార్జీలపై 5.75 శాతం చార్జీలు పెంచితే రూ.3 కోట్ల భారం జి ల్లా ప్రజలపై పడనుంది. అంటే ఏడాదికి జిల్లావాసులపై రూ.36 కోట్ల భారం పడనుంది. అయితే సామాన్య ప్రజలపై భారం పడుకుండా ఉండేందుకు గృహ వినియోగదారులకు 100 యూనిట్ల వరకు పాత చార్జీలనే వర్తింపజేయాలనే యో చనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. చార్జీల పెంపు ప్రభా వం 100 యూనిట్లు పైగా వాడుకొన్న వారిపై పడనుంది.
 నడ్డి విరిగేది ఇలా..
     
{పస్తుతం 200 యూనిట్ల వరకు రెండు విధాలుగా చార్జీలు వసూలు చేస్తున్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగించిన వారికి 50 యూనిట్ల వరకు రూ.1.45.. 51 నుంచి 100 యూనిట్ల వరకు రూ.2.60.. 101 నుంచి 200 వరకు రూ.3.60 వసూలు చేస్తున్నారు.

     నెలలో 200 యూనిట్లకు పైగా వినియోగించే వారికి స్లాబ్ రేట్లను పెంచి వసూలు చేస్తున్నారు. 50 యూనిట్ల వరకు రూ.2.60.. 51 నుంచి 100 యూనిట్ల వరకు రూ.3.25.. 101 నుంచి 150 వరకు రూ.4.88.. 151 నుంచి 200 వరకు రూ.5.63.. 201 నుంచి 250 వరకు రూ.6.38.. ఇలా చివరి స్లాబ్ 500 యూనిట్లకు పైగా వాడిన వారికి యూనిట్‌కు రూ.8.38 వసూలు చేస్తున్నారు. ఈ చార్జీలపై ప్రస్తుతం రూపొందించిన ప్రతిపాదనల మేరకు 5.75 శాతం చార్జీలు పెరగనున్నాయి.ఇదే విధంగా కమర్షియల్, పరిశ్రమలు, కేటగిరీ-6లోని వీధి దీపాలు, నీటి సరఫరా పంపులకు, రైల్వే, లిఫ్ట్ ఇరిగేషన్‌కు ఇవీ వర్తించనున్నాయి.
     
{పస్తుతం జిల్లాలో ప్రతి నెల దాదాపు గృహ వినియోగదారులు బిల్లులు రూ.12.45 కోట్లు, కమర్షియల్ రూ.11.30 కోట్లు, పరిశ్రమల ద్వారా రూ.16 కోట్లు, వీధి దీపాలు, తాగు నీటి సరఫరా పథకాల ద్వారా రూ.3.78 కోట్లు, రైల్వే రూ.7 కోట్లు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రూ.1.50 కోట్లు,  ఇతరత్రా మరో రూ.కోటికి పైగా బిల్లులు విధిస్తున్నారు.
     
తాజా పెంపు ప్రతిపాదనలతో ఈ మొత్తం రూ.56 కోట్లకు చేరనుంది. జిల్లాలో ప్రస్తుతం గృహ వినియోగదారుల కనెక్షన్‌లు 8.40 లక్షలు, కమర్షియల్ కనెక్షన్‌లు 84వేలు, పరిశ్రమల కనెక్షన్‌లు 8 వేలు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా పథకాల కనెక్షన్‌లు 9,500, కేటగిరీ-7లో ఆరు వేలు ఉన్నాయి.
 
చార్జీలు పెంచొద్దు

నా పేరు వై యూదగిరి. మాది జనగామ మండలం వెంకన్నకుంట. నేను కార్పెంటర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఇప్పటికే ధరలు పెరిగి ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ఇప్పుడు కరెంటు చార్జీలు పెంచితే బతకడం కష్టమే. పని కూడా గిట్టుబాటు కాదు. చార్జీల పెంపు నిర్ణయూన్ని ప్రభుత్వం విరమించుకోవాలి.

విద్యుత్ కనెక్షన్లు    :    9,47,500
చార్జీల పెంపు        :    5.75 శాతం
ఏడాదికి వడ్డన      :    రూ.36 కోట్లు
 
 

మరిన్ని వార్తలు