‘దెయ్యాలు వేదాలు  వల్లించినట్లు ఉంది’

5 Mar, 2019 02:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపుల గురించి టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీపీసీసీ కోశాధికారి, ఎమ్మెల్సీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయ ఫిరాయింపులు తప్ప.. టీఆర్‌ఎస్, కేసీఆర్, కేటీఆర్‌ లు చేసిందేమీలేదని విమర్శించారు. తెలంగాణ రాజ కీయాలను దిగదార్చిన చరిత్ర టీఆర్‌ఎస్‌దేనన్నారు.

సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆదివాసీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరితేనే వారి సమస్యలు పరిష్కరిస్తామని కేటీఆర్‌ చెప్పడం బ్లాక్‌మెయిల్‌ రాజకీయం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్యెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడమంటే, వారిని ప్రలోభాలకు గురిచేయడం తప్ప మరేంటని ప్రశ్నించారు. అధికార పార్టీని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎలా ప్రలోభాలకు గురిచేస్తుందో చెప్పాలని నిలదీశారు. అధికార పార్టీ నేతల నియంతృత్వ విధానాల కారణంగానే బీజేపీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌లో చేరారని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు