‘ధూప దీపానికి’ మార్గదర్శకాలు జారీ

9 Nov, 2017 01:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక పరిపుష్టి లేని ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం కింద ప్రతినెలా ఆర్థిక చేయూత అందిస్తున్న దేవాదాయ శాఖ కొత్తగా మరో 3 వేల దేవాలయాలకు దాన్ని వర్తింపచేసే క్రమంలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

- దేవాదాయ చట్టం పరిధిలోని చారిటబుల్‌ ట్రస్టు లేదా హిందూ ధార్మిక సంస్థ జాబితాలో ఆ దేవాలయం రిజిస్టరై ఉండాలి. 
- కనీసం 15 సంవత్సరాల క్రితం నిర్మితమై ఉండాలి, పురాతన దేవాలయం అయితే ప్రాధాన్యం ఇస్తారు. 
- గ్రామం/పురపాలక సంఘం పరిధిలో మాత్రమే ఉండాలి, నగర పాలక సంస్థ పరిధిలో ఉంటే పరిగణనలోకి తీసుకోరు.
- దేవాలయం పరిధిలో రెండున్నర ఎకరాలకు మించి తరి పొలం ఉండరాదు, 5 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. 
- వార్షికాదాయం 50 వేల లోపే ఉండాలి. జాతరలు సాగే గ్రామ దేవతల ఆలయాలకు ఈ పథకం వర్తించదు. 
- దరఖాస్తులను సంబంధిత జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ కార్యాలయం నుంచి స్వీకరిస్తారు.
జాయింట్‌ కలెక్టర్, సహాయ కమిషనర్, అర్చక సమాఖ్య నియమించిన ఇద్దరు ప్రతినిధులు, ముఖ్య దేవాలయాల ప్రతినిధులతో కూడిన కమిటీ ఆలయాన్ని తనిఖీ చేసి తప్పనిసరిగా సిఫారసు చేయాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు