పని ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోండి

3 May, 2020 02:15 IST|Sakshi

నిర్మాణ రంగానికి మార్గదర్శకాలు

సామాజిక దూరం పాటించాలి

ఉదయం,సాయంత్రం థర్మల్‌ స్క్రీనింగ్‌

నిర్మాణ సంస్థలకు ప్రభుత్వ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: నిర్మాణ రంగానికి కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన నేపథ్యంలో, పని ప్రదేశాల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రం శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. పురపాల న, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్వి అర్వింద్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే నిర్మాణం జరిగే ప్రాంతాల్లో ఉన్న కార్మికుల క్యాంపులు, లేదా బయటి నుంచి వచ్చే కా ర్మికులు ఈ నిబంధనలు పాటించేలా చూడాలని స్పష్టం చేశారు.
► రోజూ ఉదయం కార్మికులతో సమావేశం ఏర్పా టు చేసి సామాజిక దూరం పాటించడం వంటి మార్గదర్శకాలు పాటిస్తున్నదీ లేనిదీ సమీక్షించా లి. ప్రతి ఒక్కరికీ ఉదయం, సాయంత్రం వేళల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి. పని ప్రదేశం లో సబ్బు, శానిటైజర్లు, నీటిని అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించేలా చూడాలి. పని ప్రారంభించే ముందు, విధు ల నుంచి వెళ్లే సమయంలో తమ చేతులు కడుక్కుని వెళ్లాల్సి ఉం టుంది. పని ప్రదేశంలో ప్రవేశించే ప్రతి ఒక్కరూ మాస్క్‌ను విధిగా ధరించాలి. బయట నుంచి వ చ్చే నిర్మాణ సామగ్రి, పనిముట్లను ఉపయోగిం చే సమయంలో విధిగా చేతి గ్లౌజులు ధరించాలి. గుట్కా, పొగాకు, పాన్‌ తదితరాలను పని ప్రదేశాల్లో పూర్తిగా నిషేధించడంతో పాటు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం.
► ఒకేచోట గుమికూడకుండా, సామాజిక దూరా న్ని పాటిస్తూ భోజనం చేయాలి. రోజూ సైట్‌ కా ర్యాలయంతో ప్రవేశ ద్వారాలు, క్యాంటీన్లు, కా ర్మికుల నివాస సముదాయాలు, నడిచే మార్గాలతో పాటు పని ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. పా రిశుధ్య సిబ్బందికి అవసరమైన సామగ్రి అందజేయాలి. పని ప్రదేశంలోకి అవసరం లేని వారి ప్రవేశాన్ని నిషేధించాలి. కరోనాకు చికిత్స అం దించే ఆస్పత్రులు, క్లినిక్‌ల వివరాలను పని ప్రదేశంలో ప్రదర్శించాలి. క్రమం తప్పకుండా వైద్యు డు పని ప్రదేశాన్ని సందర్శించాలి.
► కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుగు లేదా హిందీలో కార్మికులకు అర్థమయ్యే భాషలో ప్రదర్శించాలి. అనుమానాలు, సందేహాలు ఉంటే ప్రాజెక్టు మేనేజర్‌ లేదా సేఫ్టీ ఆఫీసర్‌ను సంప్రదించేలా అవగాహన కల్పించాలి. పుకార్లను వ్యాపింపజేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో బాధ పడుతున్న వారిని ఆస్పత్రికి తరలించడంతో పాటు 108 లేదా 104 నంబర్‌కు సమాచారం అందించాలి. పని ప్రారంభించే తొలి రోజు అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి.
► కార్మికవాడలో ఉండే కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేక నంబర్‌తో కూడిన ఫొటో గుర్తింపు కార్డు అందజేయాలి. ప్రతి కార్మికుడి వి వరాలతో రికార్డులు నిర్వహించాలి. కార్మికులు పని ప్రదేశం వదిలి బయటకు వెళ్లకుండా స్థాని కంగానే వారికి అవసరమైన నిత్యావసరాలు, ఇతరాలను సమకూర్చాలి. తప్పనిసరి పరిస్థితు ల్లో బయటకు వెళ్లాల్సి వస్తే సంబంధిత సూపర్‌వైజర్‌ అనుమతితో మాస్క్‌ ధరించి వెళ్లాలి.

మరిన్ని వార్తలు