తల్లిదండ్రులూ ఇంగ్లిష్‌ నేర్చుకోవాలి

25 May, 2019 07:45 IST|Sakshi
మాట్లాడుతున్న లక్ష్మీబాయి

మణికొండ: రాబోయే రోజుల్లో  ఆంగ్లభాష ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం అవుతుందని, దాన్ని నేర్చుకునేందుకు ప్రతి గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలని రాష్ట్ర మార్కెటింగ్‌ డైరెక్టర్‌ జి.లక్ష్మీబాయి పేర్కొన్నారు. గండిపేట మండలం నార్సింగి గురుకుల బాలకల పాఠశాలలో ఆరు రోజులుగా తల్లిదండ్రులకు బోలో ఇంగ్లీష్‌ ధనాధన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అలుమి రిలేషన్స్‌ ప్రత్యేక అధికారి కొరివి వినయకళ అధ్యక్షత వహించగా ఆమె ముఖ్యఅథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచభాషగా పిలుస్తున్న ఆంగ్లభాషను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

విద్యార్థులకు తాము పాఠశాలల్లో ఆంగ్లంలో బోధిస్తున్నా తల్లిదండ్రులు వారితో మాట్లాడలేక పోవటంతో పూర్తి స్థాయి ఫలితం రావడం లేదన్నారు. అందుకే తల్లిదండ్రులకు సైతం ఆగ్లభాష నేర్చించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా కొందరు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమకు ఆంగ్లభాష నేర్చుకోవాల్సిన అవసరాన్ని సమగ్రంగా వివరించారని, రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తామన్నారు. గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ తల్లితండ్రులు ఆంగ్లం నేర్చుకుని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించే దిశగా వారితోనే పోటీ పడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సీఓలు, ప్రిన్సిపాల్‌లు, కోఆర్డినేటర్‌లు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఖాకీ’ కళంకం

అలరించిన  ‘మల్లేశం’ యూనిట్‌

హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

వీఆర్‌ఏపై మహిళా చెప్పుతో దాడి

‘పర్సనల్‌’లో ప్రమోషన్లు లేనట్లేనా..!

50 మంది విద్యార్థినులు అస్వస్థత

కాకినాడ అమ్మాయి.. హైదరాబాద్‌ అబ్బాయి..

రైలు ఢీకొని రిటైర్డ్‌ ఏఎస్సై దుర్మరణం

సర్పంచ్‌ల చేతికొచ్చిన ‘పవర్‌’ 

రోగాలకు నిలయం

ఈసారి గణేశుడు ఇలా..

విలీనమేదీ?

సెల్లార్‌ ఫిల్లింగ్‌

ఇంటిపంట పండిద్దాం

ఆ కామాంధుడిని ఉరి తీయాలనుంది

గోదావరి వరదకు అడ్డుకట్ట! 

ఆయిల్‌ఫెడ్‌లో ‘వ్యాట్‌’ కుంభకోణం

నేడు విశాఖ శారద పీఠాధిపతులకు పుష్పాభిషేకం 

ఆ పిల్లల స్థితిగతులపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు

పోలీసు నియామకాల్లో ‘స్పోర్ట్స్‌ కోటా’ గందరగోళం 

పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత 

తెలంగాణ నాడి బాగుంది!

కచ్చితంగా పార్టీ మారతా 

గురువులకు ప్రమోషన్ల పండుగ

చౌకగా పౌష్టికాహారం!

ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు వాయిదా?

28, 29 తేదీల్లో ఇద్దరు సీఎంల భేటీ 

వ్యాపార దిగ్గజం మీలా.. అస్తమయం 

గిరిజనం వద్దకే వైద్య పరీక్షలు!

సచివాలయం నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సైరా’ సంగీత దర్శకుడికి మెగా ఆఫర్‌

గూగుల్‌లో వారం రోజుల పాటు ఉద్యోగం చేశాను..

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కల్కి’

మీకు అర్థం కాదా : జ్యోతిక ఫైర్‌

మేఘాకు జాక్‌పాట్‌

ఆ కోరిక ఇంకా తీరనేలేదు!