భళా.. ‘ఇంధన రహిత బైక్‌’

7 Feb, 2020 10:39 IST|Sakshi
ఇంధన రహిత బైక్‌తో గురుకుల విద్యార్థులు

మైనారిటీ గురుకుల విద్యార్థుల ప్రతిభ

ఆవిష్కరించిన మైనారిటీ

గురుకుల పాఠశాల విద్యార్థులు

సాక్షి,సిటీబ్యూరో: కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు ‘ఇంధన రహిత బైక్‌ ’ను ఆవిష్కరించారు. కాగజ్‌ నగర్‌ మైనారిటీ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న సలీం, జె.ఆకాష్, అఖిల్‌ కుమార్, ఎస్‌.డి.ఆలం, మాలికార్జున్, ఎం.డి.ఇసానుల్లాఖాన్‌లు బృందంగా ఏర్పడి బైక్‌ తయారీలో సఫలీకృతులయ్యారు. ఈ బైక్‌కు పెట్రోల్, డీజిల్, చార్జింగ్‌ లాంటి ఎలాంటి ఇంధనం అవసరం లేదు. 50–60 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. మైనారిటీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి బి.షఫీవుల్లా ఇటీవల కాగజ్‌ నగర్‌లోని గురుకులాలను పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులు ‘ఇంధన రహిత బైక్‌’ తయారీ ప్రాజెక్టు కోరికను వ్యక్తం చేశారు. స్పందించిన కార్యదర్శి విద్యార్థులను ప్రోత్సహించడానికి హైదరాబాద్‌ బహదూర్‌పురా బాయ్స్‌–1లో వారికి తగిన సౌకర్యాలు కల్పించారు. తక్కువ వ్యవధిలో గేర్‌లెస్‌ బైక్‌ సిద్ధమైంది. శాశ్వత మాగ్నెట్‌ బ్రష్‌లెస్‌ డీసీ (బీఎల్‌డీసీ) మోటార్, పవర్‌ కంట్రోలర్, డైనమో, బ్యాటరీస్, ఎంసీబీ బాక్స్‌లు ఏర్పాటు చేసి తద్వారా శక్తిని పొందేలా ఏర్పాటు చేశారు. పెట్రోల్, ఇంజన్‌ బైక్‌ లానే ఉంటుంది.

సమ్మర్‌ వెకేషన్‌లో ఎక్స్‌పోజర్‌ వర్క్‌షాప్‌
మైనారిటీ గురుకుల ప్రత్యేక ఆవిష్కరణ ఇంధన రహిత బైక్‌ అని రుకుల కార్యదర్శి బి. షఫీవుల్లా వెల్లడించారు. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్‌ దొరకడం చాలా కష్టం, కాబట్టి ఈ బైక్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ తరహా వినూత్న ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సమ్మర్‌ వెకేషన్‌లో హైదరాబాద్‌లో ఎక్స్‌పోజర్‌ వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు