ఇంటర్‌ ఫలితాల్లో గురుకులాల గుబాళింపు..!

14 Apr, 2018 11:29 IST|Sakshi
సుదిమళ్ల గురుకుల కళాశాల

రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచిన జిల్లా విద్యార్థులు

భద్రాచలం: గురుకులాల విద్యార్థులు ఇంటర్‌ ఫలితాల్లో తమ ప్రతిభను చూపారు. ఆర్ట్స్‌ విభాగంలో ఏకంగా రాష్ట్ర స్థాయిలో  టాపర్‌గా నిలిచి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు.  అనేక మంది విద్యార్థులు మంచి మార్కు లు సాధించి, గురుకులాల పేరును రాష్ట్రస్థాయిలో పదిలంగా ఉంచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో గల అంకంపాలెం, భద్రాచలం, సుదిమళ్ల బాలికల కళాశాల నుంచి 428 మంది విద్యార్థినీలు ఇంటర్‌ రెండో సం వత్సరం పరీక్షలకు హాజరుకాగా, ఇందులో 378 మంది (88.32 శాతం) ఉత్తీర్ణులయ్యారు. దమ్మపేట, కెస్‌డీసైట్, కృష్ణసాగర్, గుండాల, కాలేజ్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ బాలుర కళాశాలల నుంచి మొత్తం 403 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, ఇందులో 309 మంది (76.67శాతం) పాసయ్యారు. బాలికలు, బాలురు కలిపి మొత్తం రెండో సంవత్సరం నుంచి  831 మంది విద్యార్థులకుగానూ 687 (82.67) మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ఒకేషనల్‌లో బాలికలు 78 మందికిగాను 78 మంది పాసవ్వగా, బాలురు 34 మందికి గాను 30 మంది ఉత్తీర్ణులయ్యారు. 

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో:  ఇంటర్‌ ప్రథమ సంవ్సరంలో  అంకంపాలెం, భద్రాచలం, సుదిమళ్ల బాలికల  కళాశాలల నంంచి 501 మందికి గాను 397 మంది(79.24 శాతం) ఉత్తీర్ణులయ్యారు.  అదే విధంగా దమ్మపేట, కెస్‌డీసైట్, కృష్ణసాగర్, గుండాల, కాలేజ్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ బాలుర కళాశాలల నుంచి మొత్తం 394 మందికిగాను 311 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా బాలికలు, బాలురు కలిపి 895 మందికి గాను 708 మంది(79.11శాతం) పాసయ్యారు.  ఒకేషనల్‌ కోర్సులో బాలికలు 78 మందికి గాను 78 పాసవ్వగా, బాలురు 38కి గాను 31 మంది ఉత్తీర్ణులయ్యారు. 

గురుకులాల రాష్ట్రస్థాయి టాపర్‌లు వీరే..
రెండో సంవత్సరం:వీ వీణాకుమారి –915 సీఈసీ అంకంపాలెం
డీ విమలత   –  919  హెచ్‌ఈసీ సుదిమళ్ల
మొదటి సంవత్సరం:కె కావేరి– 466  సీఈసీ అంకంపాలెం
డీ శ్రావణి–  474 సుదిమళ్ల

మరిన్ని వార్తలు