‘నల్లగొండ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తా’

26 Aug, 2019 19:24 IST|Sakshi

సాక్షి, నల్లొండ : ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా సోమవారం ఆయన ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని ప్రజాసేవలో సద్వినియోగం చేసుకుంటానని అన్నారు. నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం మంత్రి జగదీశ్‌ రెడ్డి, ప్రజా ప్రతినిధులతో కలిసి అహర్నిశలు శ్రమిస్తానని ఆయన తెలిపారు. తనను ఆశీర్వదించడాని​కి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. ఎమ్మెల్యే భాస్కర్‌ రావు, గొంగిడి సునీత తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు