ప్రాజెక్టుల ఎత్తు తగ్గిస్తే తీరని అన్యాయం: గుత్తా

9 Mar, 2016 01:27 IST|Sakshi

నల్లగొండ: గోదావరిపై ప్రాజెక్టులు నిర్మిం చేందుకు మహారాష్ర్ట ప్రభుత్వంతో చేసుకుం టున్న ఒప్పందం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలను సంప్రదిస్తే బాగుండేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు.

కాంగ్రెస్ పాలనలో తుమ్మడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించారన్నారు. దీంతో మహారాష్ట్ర పరిధిలో కేవలం1,800 ఎకరాలు సాగుకు యోగ్యం కాని భూమి మాత్రమే ముం పునకు గురవుతుందన్నారు. ప్రస్తుతం మహారా ష్ట్ర విజ్ఞప్తుల మేరకు ప్రాజెక్టుల ఎత్తు తగ్గించేం దుకు తెలంగాణ అంగీకరించినట్లు తెలుస్తోందన్నారు. దీని వల్ల ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులోకి ప్రతిపాదించిన మేరకు గోదావరి నీళ్లు వచ్చే అవకాశం ఉండదన్నారు.
 

>
మరిన్ని వార్తలు