బ్రహ్మానందానికి ‘హాస్య నట బ్రహ్మ’ అవార్డు

12 Mar, 2018 02:17 IST|Sakshi
బ్రహ్మానందాన్ని సత్కరిస్తున్న స్పీకర్‌ మధుçసూదనాచారి, జూపల్లి, సుబ్బరామిరెడ్డి. చిత్రంలో రాజశేఖర్, జయప్రద, జీవిత, ఎంపీ జితేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌లో ఘనంగా కాకతీయ కళా వైభవం వేడుకలు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: 1,100 సినిమాల్లో నటించిన ప్రముఖ హాస్యనటుడు కె.బ్రహ్మానందాన్ని ‘హాస్య నట బ్రహ్మ’ అవార్డుతో సత్కరించారు. టీఎస్‌ఆర్‌ కాకతీయ లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇందులో స్పీకర్‌ మధుసూదనాచారి, కళాబంధు సుబ్బరామిరెడ్డి, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ.. ఓరుగల్లు కాకతీయ కళావైభవ గొప్పతనాన్ని చాటిచెప్పేందుకు సుబ్బరామిరెడ్డి తన సంస్థ ద్వారా ఈ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సినీనటులు జయప్రద, రాజశేఖర్, జీవిత, బాబుమోహన్, అలీ, శ్రద్ధాదాస్, రఘుబాబు, శ్రీనివాస్‌రెడ్డిలకు కాకతీయ పురస్కారాలు అందజేశారు. కళారంగంలో సేవలు అందిస్తున్న ఉమ్మడి జిల్లాకు చెందిన ఎల్లూరి శివారెడ్డి, కపిలవాయి లింగమూర్తి, గోరటి వెంకన్న, చిక్కా హరీశ్, జంగిరెడ్డి, వంగీశ్వర నీరజ, పద్మాలయ ఆచార్యను ‘కాకతీయ అవార్డు’లతో సత్కరించారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీలు జితేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు