బీభత్సం సృష్టించిన వడగళ్ల వాన

19 Apr, 2019 17:44 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: మండే ఎండలు ఒకవైపు.. అకాల వర్షాలు మరోవైపుతో తెలంగాణ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమైన రైతన్నలకు అపారనష్టాన్ని కలగజేసింది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వరుసగా మూడోరోజు కూడా గాలివాన, వడగళ్లు పడడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని మేడిపల్లి​, మల్యాల, గన్నేవరం, బెజ్జంకి, కోహెడ మండల్లాలో వడగళ్ల వాన కురిసింది. గాలులు వీచడంతో జగిత్యాల, నిజామాబాద్‌ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. అకాల వడగండ్ల వానతో పంటనష్టం సంభవించి నష్టపోయిన బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది .. ఆకాశం మేఘావృతమై…మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం  సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వడగళ్ల వాన కురిసింది.  హైదరాబాద్‌ నగరంలో నగరంలోని ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో భారీ వర్షం సంభవించింది. దీంతో పలుచోట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

మరిన్ని వార్తలు