ఫిబ్రవరి 6న హాజీపూర్‌ కేసు తుదితీర్పు

27 Jan, 2020 19:55 IST|Sakshi

సాక్షి, నల్గొండ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హజీపూర్‌ వరుస హత్యల కేసులో తీర్పు మరోసారి వాయిదా పడింది. జడ్జిమెంట్‌ కాపీ ఇంకా సిద్ధం కానందున ఫిబ్రవరి 6వ తేదీకి తీర్పు వాయిదా వేస్తున్నట్లు నల్గొండ కోర్టు సోమవారం ప్రకటించింది. దీంతో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు నల్గొండ జైలుకు తరలించారు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు బాలికలను అత్యంత క్రూరంగా, పాశవికంగా అత్యాచారం చేసి బావిలో మృతదేహాలను పూడ్చి పెట్టిన ఘటన గతేడాది సంచలనం సృష్టించిన సంగతి విదితమే.

ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు మూడు నెలల పాటు సుదీర్ఘ విచారణను చేపట్టింది. దాదాపు 300మంది సాక్షులను విచారించి.. 101 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఫోరెన్సిక్ నివేదిక కీలకం కానున్న ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్షను విధించేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బలమైన సాక్ష్యాలను సమర్పించారు. అటు గ్రామస్థులు ఇటు బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న నల్గొండ ఫాస్ట్‌ కోర్టు తుది తీర్పును వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది.

చదవండి:
సమత కేసులో తుదితీర్పు ఈ నెల 30కి వాయిదా

హాజీపూర్‌ కేసు: శ్రీనివాస్‌రెడ్డిది అంతా నేర చరిత్రే

అంతా అబద్ధం సార్‌..

మరిన్ని వార్తలు