రూ. అరకోటి బ్రౌన్‌షుగర్ పట్టివేత

9 Jun, 2015 03:26 IST|Sakshi
రూ. అరకోటి బ్రౌన్‌షుగర్ పట్టివేత

ఒకరి అరెస్టు
పరారీలో మరో ఇద్దరు
యాకుత్‌పురా:
మాదకద్రవ్యాలు తరలిస్తున్న ఓ వ్యక్తిని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.50 లక్షల విలువ చేసే కిలో బ్రౌన్‌షుగర్, మాండ్రాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పురానీహవేలిలోని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి, దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఠాగూర్ సుఖ్‌దేవ్ సింగ్‌తో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్‌రావుపల్లి గ్రామానికి చెందిన చిగురు రామచంద్రం (25) మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ డాలర్ మార్కెట్ నుంచి వ్యవసాయ పరికరాలు నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తుంటాడు.

ఈ క్రమంలో ఇతనికి ఇండోర్‌కు చెందిన మాదకద్రవ్యాలు (డ్రగ్స్) సరఫరాదారుడు సత్‌పాల్‌సింగ్(40)తో పరిచయం ఏర్పడింది. డ్రగ్స్ విక్రయిస్తే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని అత ను రామచంద్రంకు చెప్పాడు. దీంతో రామచంద్రం అతడి వద్ద నుంచి 600 గ్రాముల బ్రౌన్‌షుగర్, 400 గ్రాముల మాండ్రాక్స్ మొత్తం రూ. 50 లక్షల విలువ చేసే కిలో మాదక ద్రవ్యాన్ని తీసుకున్నాడు.  కరీంనగర్‌కు చెందిన మోహ న్ (35)కు ఈ మాదకద్రవ్యాలను విక్రయించేందుకు సోమవారం ఉదయం జూబ్లీబస్టాండ్ చేరుకున్నాడు.

విశ్వసనీయ సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు రామచంద్రంను అదుపులోకి తీసుకోగా.. మోహన్ పరారయ్యాడు. పోలీసులు రామచంద్రం వద్ద నుంచి కిలో మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు రామచంద్రంతో పాటు మోహన్, సత్‌పాల్‌సింగ్‌లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాదక ద్రవ్యాలను సత్‌పాల్‌సింగ్ ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌ల మీదుగా మనదేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల కు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సమావేశంలో దక్షిణ మండలం టా స్క్‌ఫోర్స్ ఎస్సైలు జి.మల్లేష్, కె.వెంకటేశ్వ ర్లు, గౌస్ ఖాన్, డి.వెంకటేశ్వర్లు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చాంద్ భాషా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు