'చేతిరాత పాస్ పోర్టులు ఇక చెల్లవు'

29 Jan, 2015 12:39 IST|Sakshi

హైదరాబాద్ : చేతిరాత పాస్పోర్టులకు ఇంక కాలం చెల్లనుంది. ఈ ఏడాది నవంబర్ 24వ తేదీ నుంచి చేతిరాతతో ఉన్న పాస్పోర్టులు చెల్లవని హైదరాబాద్ రీజనల్ పాస్పోర్టు అధికారి అశ్వినీ సత్తార్ తెలిపారు.  2014లో రికార్డు స్థాయిలో 14 లక్షల పాస్పార్టులు జారీ చేసినట్లు ఆమె గురువారమిక్కడ వెల్లడించారు. హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అశ్వినీ సత్తార్ తెలిపారు.  

చేతిరాత పాస్పోర్టులను మిషన్ రీడబుల్ చేసుకోవాలని ఆమె సూచించారు. అలాగే ప్రతి పాస్పోర్టులో రెండు పేజీలు ఖాళీగా ఉండాలని, లేకుంటే  జంబో పాస్పోర్టులకు దరఖాస్తు చేసుకోవాలని అశ్వినీ సత్తార్ సూచించారు. ఆంధ్రప్రదేశ్కు త్వరలోనే విశాఖపట్నం పాస్పోర్టు ఆఫీస్ను రీజనల్ కార్యాలయంగా మార్చుతామన్నారు.

మరిన్ని వార్తలు