శ్రీవాణి.. చేనేత రారాణి

8 Mar, 2019 08:53 IST|Sakshi

ఫ్యాషన్‌ డిజైన్‌ రంగంలో తనదైన ప్రత్యేకత  

మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న నల్లకుంట వాసి  

అంబర్‌పేట: సంప్రదాయ చేనేత వస్త్రాలతో ఫ్యాషన్‌ రంగంలో తనదైన ప్రత్యేకత చాటుకుంటున్నారు నగరంలోని నల్లకుంటకు చెందిన శ్రీవాణి. చేనేత కార్మికులు నేసిన వస్త్రాలతో ఆధునిక ఫ్యాషన్‌ రంగంలో వస్తున్న వస్త్రాలకు దీటుగా విభిన్నమైన డిజైన్లను రూపొందిస్తున్నారు.  ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు పూర్తి చేసిన శ్రీవాణి ఆ తర్వాత కొంతకాలం  ఉద్యోగం చేశారు. వివాహానంతరం ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి ఐదేళ్లుగా ఫ్యాషన్‌ రంగంలో రాణిస్తున్నారు. నెలలో 2 నుంచి 3 వరకు వివిధ ఎగ్జిబిషన్లలో పాల్గొని చేనేత గొప్పదనాన్ని చాటుతున్నారు. పలు డిజైన్‌ వస్త్రాల ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. చేనేత వస్త్రాలతో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రూపొందించడం ఖరీదైనప్పటికీ వాటితోనే డిజైనర్‌గా రాణిస్తున్నారామె. తనతో పాటు మరో నలుగురికి ఉపాధి పొందుతూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీవాణి. ఎన్నో రాష్ట్రస్థాయి వేదికలపై ఫ్యాషన్‌ డిజైన్లను ప్రదర్శించిన ఆమె.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. మహిళలు తమదైన ప్రత్యేకతను చాటుకోవాలని ఆకాంక్షించారు.

డెంట్‌గా శ్రీకాంత్, వైస్‌ ప్రెసిడెంట్లుగా బెనర్జీ, ఎస్వీ కృష్ణారెడ్డి, జనరల్‌ సెక్రెటరీగా రఘుబాబు, జాయింట్‌ సెక్రెటరీలుగా బ్రహ్మాజీ, నాగినీడు, కోశాధికారిగా రాజీవ్‌ కనకాల, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా తనీష్, ఉత్తేజ్, అనితాచౌదరి, బాలాజీ, పృథ్విరాజ్, భూపాల్‌రాజు, సి.వెంకటగోవిందరావు, డి.రాజారవీంద్ర, డి.రవిప్రకాశ్, ఏడిద శ్రీరామ్, జయలక్ష్మి, వేణు మాధవ్, కొండేటి సురేష్, పి.సాయికుమార్, రాజ్‌తరుణ్, సమీర్, తనికెళ్ల భరణి తదితరులు పోటీపడుతున్నారు.

మరిన్ని వార్తలు