ఆస్ట్రేలియా అమ్మాయి.. హన్మకొండ అబ్బాయి

23 Nov, 2019 10:39 IST|Sakshi
వివాహ వేదికపై దినేష్‌బాబు – డెమ్మి మార్గరేట్‌ రాబెలింగ్‌

హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటైన ప్రేమజంట

సాక్షి, హన్మకొండ: చదువు రెండు దేశాలకు చెందిన యువతీయువకులను కలిపింది.. ప్రేమ మరింత దగ్గర చేయగా వివాహబంధంతో ఒక్కటయ్యారు... ఆస్ట్రేలియా దేశానికి చెందిన యువతితో తెలంగాణ యువకుడికి హిందూ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన సుఖవాసి మహామహేశ్వర్‌రావు, విజయకుమారి దంపతులు హన్మకొండలో స్థిరపడగా వారి కుమారుడు దినేష్‌బాబు ఎం ఫార్మసీ చదువుకునేందుకు ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు వెళ్లాడు. అక్కడి చాల్స్‌ యూనివర్సిటీలో ఎం ఫార్మసీ చదువుతున్న డెమ్మి మార్గరేట్‌ రాబెలింగ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ మేరకు ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించడంతో హన్మకొండలోని నందనా గార్డెన్స్‌లో శుక్రవారం వివాహం జరిపించారు. ఈ వివాహానికి హాజరైన డెమ్మి మార్గరేట్‌ రాబెలింగ్‌ కుటుంబీకులు, స్నేహితులు సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి వేడుకను ఆసక్తిగా తిలకించడం ఆకట్టుకుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు