వైఎస్‌ జగన్‌ సీఎం కావడం సంతోషంగా ఉంది: కోమటిరెడ్డి

25 May, 2019 08:30 IST|Sakshi

సాక్షి, నల్గొండ: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికకావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. పదేళ్లు అలుపెరగని పోరాటం చేసి ప్రజల మనస్సును గెలుచుకున్న నాయకుడు వైఎస్‌ జగన్‌అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కుటుంబం వైఎస్సార్‌ది అని, ఆయనతో ఉన్న జ్ఞాపకాలను కోమటిరెడ్డి గుర్తుచేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైఎస్‌ జగన్‌కు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపాలైన కోమటిరెడ్డి.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఆయన ఈ విధంగా మాట్లాడారు.

మరిన్ని వార్తలు