త్వరలో శిల్పారామం ఏర్పాటు: హరీశ్‌ రావు

14 Dec, 2019 09:55 IST|Sakshi
విపంచి కళా నిలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు 

 కళాకారులకు నిలయం సిద్దిపేట

 విపంచికి వినయ నమస్కారం

‘విపంచి’ ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు 

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): విపంచికి వినయ నమస్కారం. సిద్దిపేటలో విపంచి కళానిలయం ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలో విపంచి కళానిలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట కవులకు, కళాకారులకు నిలయమన్నారు. సిద్దిపేట అన్ని రంగాల్లో రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సిద్దిపేట పర్యాటక ప్రాంతంగా మారిందన్నారు. సిద్దిపేటలో కోమటి చెరువు, ఓపెన్‌ ఎర్‌ ఆడిటోరియం, తో పాటుగా విపంచి కళానిలయం ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఈ విపంచి కళానిలయం ఏర్పాటులో సహాయం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రూ.6.5 కోట్లతో ఈ కళానిలయాన్ని నిర్మించామన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కళాప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. వైష్ణవి విజ్ఞేశ్, రామాచారి, శ్రీకాంత్,తదితర ప్రముఖల కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విపంచి అంటే బ్రహా్మదేవుని వీణా అని ముఖ్యమంత్రి ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో బేవరెజ్‌ చైర్మన్‌ దేవిప్రసాద్, కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుఖ్‌హుస్సేన్, రఘోత్తంరెడ్డి, భాష సంస్కృతికశాఖ డైరెక్టర్‌ హరిక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేటి ముఖ్యాంశాలు..

ఇదీ కరోనా సేఫ్టీ టన్నెల్‌

సమర శంఖం!

ఆ రెండూ దొరకట్లేదు..

గబ్బిలాలతో వైరస్‌.. నిజమేనా?

సినిమా

కొడుకుతో ఆడుకుంటున్న హీరో నానీ 

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!

అందరం ఒక్కటవ్వాల్సిన సమయమిది

అనుకున్న సమయానికే వస్తారు