మధ్యప్రదేశ్ సీఎంతో హరీష్ భేటీ

12 Dec, 2015 21:48 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశమయింది. మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ నాలుగో దశ ప్రాజెక్ట్, పునాస లిఫ్ట్ ఇరిగేషన్ లలో పైప్  లైన్ ల ద్వారా ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్న విధానంపై ఈ సమావేశంలో చర్చించారు. మద్యప్రదేశ్ భోపాల్ లోని నర్మద వ్యాలి డెవలప్మెంట్ అథారిటి (ఎన్వీడీఏ) కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.

సాగునీటిని విజయవంతంగా పైప్ లైన్ ల ద్వారా రైతులకు ఇస్తున్న తీరు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కొనియాడరు. తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ గురించి ఈ సమావేశం సందర్భంగా మధ్యప్రదేశ్ సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిషన్ కాకతీయ నడుస్తున్న తీరును స్వయంగా పరిశీలించాడానికి త్వరలో తెలంగాణ రాష్ట్రానికి వస్తానని శివరాజ్  సింగ్ చౌహాన్ మంత్రి హరీష్ రావు తో అన్నారు.

మరిన్ని వార్తలు