మధ్యప్రదేశ్ లో హరీష్ బృందం పర్యటన

10 Dec, 2015 15:51 IST|Sakshi

ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని మంత్రుల బృదం రెండు రోజుల పాటు మధ్యప్రదేశ్ లో పర్యటించనుంది. మధ్యప్రదేశ్ లోని లిఫ్ట్ ఇరిగేషన్, సాగు నీటి ప్రాజెక్ట్ లలో కాల్వల ద్వార కాకుండ పైప్ లైన్ల ద్వార నీటిని సరఫరా చేస్తున్న పద్దతిని తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృదం అధ్యయనం చెయనుంది.  శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు బేగంపెట ఎయిర్ పోర్ట్ నుండి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు ప్రయణం కానున్నారు.

ఈ పర్యటనలో ఓం కారేశ్వర్ నాలుగో దశ ప్రాజెక్ట్, పునాస లిఫ్ట్ ఇరిగేషన్ లను ఈ బృందం సందర్శిస్తుంది. ఇక్కడి ఆయకట్టుకు నీరును పైపు లైన్ ల ద్వారా అందిస్తున్న పద్దతులను అధ్యయనం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ లలో పని చేస్తున్న ఇంజనీర్ల తో సమావేశం కానున్నారు. వీరితో పాటు.. ఆయకట్టు కింద వ్యవసాయం చేస్తున్న రైతులతో కూడా మంతృల బృందం మాట్లాడనుంది.

రెండో రోజు పర్యటనలో భాగంగా భోపాల్ లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ కానున్నారు. మద్యప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో ఉంటారు. మంత్రుల బృందంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ లు ఉన్నారు.

మరిన్ని వార్తలు