నిరాడంబరతకు నిలువెత్తు ప్రతీక..

29 Jun, 2020 04:17 IST|Sakshi

సాక్షి, సిద్దిపేటజోన్‌: తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధా ని పీవీ నరసింహారావు గొప్ప సంస్కరణలకు నాం ది పలికిన వ్యక్తి అని, నిరాడంబరతకు నిలువెత్తు ప్రతీకగా నేటి సమాజానికి పీవీ స్ఫూర్తిగా నిలుస్తారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లో పీవీ జయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.

అనంతరం పట్టణంలో పలు చోట్ల హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఈ ఏడాదిని పీవీ శతజయంతి సంవత్సరంగా ప్రకటించారని పేర్కొన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఈ ఏడాది పొడవునా నిర్వహించాలని, అన్ని జిల్లా కేంద్రాల్లో పీవీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ సంకల్పించారని పేర్కొన్నారు.

తెలంగాణ వ్యక్తిగాపీవీకి మద్దతిచ్చా: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు చెందిన వ్యక్తి కావడమే కాకుండా ప్రధానిగానూ ఉండడంతో పీవీకి ఎంపీగా తాను మద్దతునిచ్చినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. 1991లో టీడీపీ నుంచి ఆదిలాబాద్‌ ఎంపీగా గెలిచిన తాను, 1993లో పీవీ ప్రభుత్వం మైనారిటీలో పడినపుడు ఇతర టీడీ పీ, జేఎంఎం ఎంపీలతో కలిసి మద్దతివ్వడం వ ల్ల నాడు ఆ ప్రభుత్వం నిలబడిందని గుర్తుచేశారు.

ఆదివారం పీవీ శతజయంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో మంత్రి నివాళులర్పించారు. దేశం విపత్కర స్థితిలో ఉన్నపు డు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి గాడిన పెట్టి న మొట్టమొదటి ప్రధాని పీవీ అని కొనియాడారు. ఈ సందర్భంగా పీవీతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.  

మరిన్ని వార్తలు