గోదావరి నీటితో కరువు నేల పునీతం

5 Oct, 2017 03:16 IST|Sakshi

దేవాదుల ఎత్తిపోతలతో కరువును తరిమేద్దాం: హరీశ్‌

అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న ప్రతిపక్షం

తపాస్‌పల్లి రిజర్వాయర్‌ ఎడమకాల్వ డీ–4 నీటి విడుదల

సాక్షి, సిద్దిపేట: ‘‘ఏటా గోదావరి నది నుంచి వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఆ జలాలను దేవాదుల, కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాల ద్వారా కరువుతో అల్లాడుతున్న తెలంగాణ జిల్లాలకు మళ్లించి.. బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న దే ప్రభుత్వం తపన..’’అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం దేవాదుల డీ–4 ఎడమ కాల్వ ద్వారా తపాస్‌పల్లి రిజర్వాయర్‌ నుంచి సిద్దిపేట, కొండపాక మండలాల్లోని చెరువులు నింపేందుకు నీటిని విడుదల చేశారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఏటూరునా గారం మండలం గంగారం వద్ద గోదావరి సముద్ర మట్టానికి 71 మీటర్ల ఎత్తున ప్రవహి స్తోందన్నారు. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోసి సముద్ర మట్టానికి 540 మీటర్ల ఎత్తులో ఉన్న సిద్దిపేట జిల్లాలో పారించడం ప్రభుత్వం పడు తున్న శ్రమకు నిదర్శమని హరీశ్‌ తెలిపారు. 1,539 అడుగుల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం ద్వారా ఈ ప్రాంతంలో ప్రతి చెరువుకు గోదావరి నీళ్లు మళ్లించవచ్చని చెప్పారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి నిజామా బాద్, వరంగల్, కరీంనగర్‌ జిల్లాలతోపాటు ఇప్పటి మేడ్చల్‌ జిల్లాలకు సాగునీరు, హైదరా బాద్‌కు తాగునీరు అందిస్తున్నామన్నారు. 

దేవాదులతో చెరువులకు జలకళ
దేవాదుల ఎత్తిపోతల ద్వారా ఇప్పటివరకు 180 చెరువులను నీటితో నింపామని, మరో నెలరోజుల్లో మిగిలిన 113 చెరువుల్లో జలకళ ఉట్టిపడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి 38.5 టీఎంసీల నీటిని మాత్రమే తీసుకునే అవకాశం ఉందని, దీంతో 5.59 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించడం కష్టమని మంత్రి వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని నీటి సామర్థ్యం 60 టీఎంసీలకు పెంచేందుకు జీఓలు విడుదల చేశామని, అను మతులు తీసుకుంటున్నామన్నారు. గంగారం వద్ద పంపింగ్‌ చేసే నీటి సామర్థ్యం కేవలం సంవత్సరంలో 130 రోజులకు మాత్రమే ఉందని, ఎగువన ఉన్న తుపాకులగూడెం వద్ద బ్యారేజీ కడితే సంవత్సరం పొడవునా నీటిని పంప్‌ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

అదే కంతనపల్లిలో ప్రాజెక్టు కడితే 12 గ్రామాలు, 7 వేల ఎకరాల సాగుభూమి ముంపునకు గురవుతుందని చెప్పారు. ఈ విషయం అర్థం కాని ప్రతిపక్ష నాయకులు అక్కడి ప్రజలను ముంచి.. కంతనపల్లి కట్టమంటున్నారని, నీరిచ్చే మల్లన్నసాగర్‌ కట్టకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దేవాదుల మూడో దశ నిర్మాణాలు చేయకుండా రామప్ప దేవాలయానికి ముప్పు ఏర్పడుతుందనే బూచి చూపి గత పాలకులు మధ్యలో వదిలేశారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రామప్ప దేవాలయానికి ఇబ్బంది కాకుండా పైప్‌లైన్ల ద్వారా నీటిని మళ్లిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు దేవాదుల ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.1,781 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి హరీశ్‌రావు వివరించారు. మూడో దశ పూర్తి చేస్తే పాత వరంగల్‌ జిల్లా అంతా సస్యశ్యామలంగా మారుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మూడున్నరేళ్ల వ్యవధిలోనే ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు అందిస్తున్నా మని చెప్పారు. 

వేగంగా ప్రాజెక్టుల నిర్మాణాలు 
అటవీ అనుమతులు, భూసేకరణ పూర్తి చేసుకొని ప్రాజెక్టుల నిర్మాణాలు పరు గెత్తిస్తున్నామని మంత్రి హరీశ్‌ చెప్పారు. కల్వకుర్తి నీటి సామర్థ్యం 25 టీఎంసీల నుంచి 45 టీఎం సీలకు పెంచి పాలమూరు జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా మొదలగు ప్రాజెక్టులు ద్వారా నీటిని మళ్లిస్తు న్నామన్నారు. గత పాలకులు ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకొని వదిలేస్తే టీఆర్‌ఎస్‌ 13 వేల ఎకరాల నుంచి 7 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు నిధులు కేటాయిం చిందని గుర్తుచేశారు. కరువు కోరల్లో ఉన్న తెలంగాణకు సాగునీరు అందించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులు సహకరించా ల్సింది పోయి అభివృద్ధికి విఘాతం కలిగి స్తున్నారన్నారు.  మేధావులు రాష్ట్ర అభివృ ద్ధిలో భాగస్వాములైతే ప్రజలు మరింత గౌరవిస్తారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, దేవాదులు ఎస్‌ఈ బంగారయ్య, కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు