కేసీఆర్‌ వరాలు.. హరీష్‌ చెక్కులు

4 Dec, 2019 19:30 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వగ్రామం చింతమడక గ్రామస్తుల కళ సాకారమవుతోంది. చింతమడక గ్రామంలోని ప్రతి కుటుంబం స్వయం సమృద్ధి సాధించేందుకు చేయూత ఇస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈ మేరకు బుధవారం ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు చింతమడక గ్రామస్తులకు చెక్కులు పంపిణీ చేశారు. సిద్ధిపేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న హరీష్‌రావు.. కేసీఆర్‌ హామీ మేరకు పౌల్ట్రీ, డైరీ షెడ్ల నిర్మాణానికి రెండు లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చింతమడక గ్రామానికి చెందిన 22 మందికి డైరీ యూనిట్లు, 87 మందికి పౌల్ట్రీ యూనిట్లుకు చెక్కులు అందాయి.

ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. పదిహేను రోజుల్లో షెడ్లు నిర్మించాలని లబ్ధిదారులను ఆదేశించారు. షెడ్ల నిర్మాణం పూర్తయితే పశువులు, కోళ్ల పంపిణీ చేస్తామని తెలిపారు. చింతమడకలో పాలకేంద్రం ఏర్పాటు చేసి డైరీ నడిపే వారి వద్ద నుంచి పాలు కొనుగోలు చేస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు