హరీశ్‌ రావుకు తప్పిన ప్రమాదం

29 Mar, 2019 20:49 IST|Sakshi

సాక్షి, మెదక్ ‌: టీఆర్‌ఎస్‌ పార్టీ రోడ్‌ షోలో సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావుకు కొద్దిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తుప్రాన్‌ రోడ్‌ షో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రచార వాహనంపై హరీశ్‌ రావు  ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా జనరేటర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆయన తన ప్రసంగాన్ని అర్థాంతరంగా నిలిపేసి వాహనం దిగిపోయారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆ వాహనంపై ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డితో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలోనూ ఎన్నికల ప్రచార సమయంలో కార్యకర్తలు బాణాసంచా పేల్చిన సందర్భంగా.. హరీశ్‌ రావుకు ప్రమాదం తప్పిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు