‘మంత్రి తలసాని అడగకుండానే వరమిచ్చారు’

11 Oct, 2019 17:01 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : గొల్ల, కుర్మలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అడగకుండానే వరమిచ్చారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సంఘానికి కావలసిన నిధులు మంత్రి విడుదల చేయడం సంతోషకరమని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీనివాస్‌ యాదవ్‌ చేప పిల్లలు పంపిణీ చేశారని తెలిపారు. అదే విధంగా విజయ డైరీ పాల ద్వారా రావాల్సిన బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొల్ల, కుర్మల అభివృద్ధికి కావాల్సిన నిధులు విడుదల చేశారని తెలిపారు. పశు వైద్యశాలను ప్రస్తుతం ఉన్న చోటనే ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రైతులకు పశువులు, గొర్రె పిల్లల షెడ్డుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశామని, గొల్ల, కుర్మలు అందరూ కలిసి షెడ్లు నిర్మించుకోవాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు