చరిత్రలో లేనంతగా ఖరీఫ్‌ దిగుబడులు

21 Oct, 2019 02:38 IST|Sakshi

ఈ ఏడాది 80 లక్షల టన్నుల ధాన్యం: మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట జోన్‌: చరిత్రలో ఎప్పుడూ చూడనంత వరి పంట ఈ ఏడాది ఖరీఫ్‌లో రానుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 80 లక్షల టన్నుల వరి ధాన్యం రాష్ట్రంలో పండబోతుందని, ఉమ్మడి ఏపీలో వచ్చిన పంట దిగుబడులు ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే పండుతోందన్నారు.ఆదివారం సిద్దిపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

మందపల్లి, మిట్టపల్లి మార్గంలో రూ.17.5 కోట్లతో ఇండస్ట్రియల్‌ పార్క్‌ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో 2017–18 రబీ సీజన్‌ మార్కెటింగ్‌ కమీషన్‌ రూ.1.85 కోట్లను మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ పండనంత పంట ఈ ఏడాది పండుతోందని, దీనంతటికీ ప్రభుత్వ కార్యక్రమాలు వ్యవసాయానికి భరోసాగా నిలిచాయన్నారు.

మరిన్ని వార్తలు