57 వేల మొక్కలు నాటిన పోలీస్ శాఖ 

17 Feb, 2020 20:47 IST|Sakshi

పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా హరితహారం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కు హరితహారం కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.  పోలీస్శాఖ లోని డీజీపీ స్థాయి నుండి హోం గార్డ్ లు, ఇటీవల నూతనంగా నియమితులైన ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్ల వరకు తప్పని సరిగా మొక్కలు నాటాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో నేడు అన్ని జిల్లాల్లో, పోలీస్ సంస్థల్లో నేడు ఒక్క రోజే 56,872 మొక్కలను  నాటారు. పేట్లబుర్జ్ లో నిర్వహించిన హరితహారంలో హోంమంత్రి మహమూద్ ఆలీ, పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తాలు మొక్కలు నాటారు.

డీజీపీ కార్యాలయంలో డీజీపీ మహేందర్ రెడ్డి,  సీనియర్ పోలీస్ అధికారులు మొక్కలు నాటారు. డీజీపీ,  అడిషనల్ డీజీలు,  ఐజీలతో సహా అన్ని జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీల నుండి ఎస్ఐ, కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఈ హరిత హారం లో మొక్కలను తమ పరిధిలోని పోలీస్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల లో నాటారు. అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఇతర సంస్థలైన బెటాలియన్లు, పోలీస్ శిక్షణా సంస్థలు, ఇతర సంస్థల్లో హరితహారం నిర్వహించారు. సోమవారం నిర్వహించిన హరితహారం లో 13, 629 మొక్కలు నాటి రాచకొండ పోలీస్ కమిషనరేట్ అగ్రస్థానం లో నిలువగా, 6, 278 మొక్కలు నాటి బెటాలియన్స్ ద్వితీయ స్థానం లో, 3500 మొక్కలు నాటి సైబారాబాద్ కమిషనరేట్ తృతీయ స్థానం లో నిలిచింది.

 

మరిన్ని వార్తలు