నిధులున్నా.. విడుదల కావు

6 Sep, 2015 03:17 IST|Sakshi
నిధులున్నా.. విడుదల కావు

- కేయూ పరిధిలో వింతపోకడలు
- బిల్లుల కోసం నిరీక్షిస్తున్న ప్రోగ్రాం ఆఫీసర్లు
- ప్రారంభంకాని ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరాలు
- మూలుగుతున్న రూ.1.69కోట్లు
- ఇన్‌చార్జీల పాలనతోనే అస్తవ్యస్తం..!
కేయూక్యాంపస్ :
కేయూ పరిధిలో జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్) ప్రత్యేక శిబిరాలు నిర్వహించిన ప్రోగ్రాం ఆఫీసర్లకు బిల్లుల చెల్లింపులో యూనివర్సిటీ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, వివిధ జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రోగ్రాం అధికారులు ఏటా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. ఒక్కో శిబిరానికి యూనివర్సిటీ ద్వారా రూ.22,500 చొప్పున ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా చెల్లిస్తుంది. విద్యార్థులు వారంపాటు గ్రామాలు, ఇతర ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతారు. వీరికి ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ భోజనం, వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తారు. శిబిరం ముగిశాక ఖర్చుకు సంబంధించిన బిల్లులను యూనివర్సిటీకి సమర్పిస్తారు. అధికారులు పరిశీలించి నిధులు మంజూరు చేస్తారు.
 
మంజూరైన నిధులు..
కేయూ పరిధిలో 2014-15 విద్యాసంవత్సరం లో వివిధ కళాశాలల్లో 350కిపైగా ఎన్‌ఎస్‌ఎస్ యూనినట్లు నమోదై ఉన్నాయి. గతేడాది అక్టోబర్ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రో గ్రాం ఆఫీసర్లు ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. వీటి తాలూకు వివరాలు, బిల్లుతో కూడిన ఫైలును ప్రోగ్రాం ఆఫీసర్లు యూనివర్సిటీ అధికారులకు సమర్పించారు. ఇప్పటి వరకు ముగ్గురు ఇన్‌చార్జీ వీసీలు మారారు. వారి వద్ద ఆ ఫైలు ముందుకు కదలలేదు. ఇటీవల ఇన్‌చార్జీ వీసీగా చిరంజీవులు బాధ్యలు చేపట్టగా ఆయన వద్దకు ఈ ఫైలు వెళ్లింది.  సుమారు 200 కళాశాలల్లోని ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఎనిమిది నెలలు గడిచినా ఒక్కరూపారుు విడుదల కావడంలేదు. విశేషం ఏమిటంటే.. ప్రభుత్వం ద్వారా యూనివర్సిటీకి రూ.1.69 కోట్లు మంజూరైనా విడుదల ఎందుకు చేయడంలేదో అర్థం కావడంలేదు.
 
బిల్లులపై ఆడిట్‌తోనే..!
గత విద్యాసంవత్సరంలోని బిల్లులు కావడంతో ఇవి సరైనవా, కాదా? అనే విషయంపై ఆడిట్ చేరుుంచారని తెలిసింది. ఇదే బిల్లుల విడుదలలో జాప్యానికి కారణమని తెలుస్తోంది. మరోవైపు.. తమకు బిల్లులు చెల్లించాలంటూ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు నెలల కొద్దీ కేయూ ఆర్డినేటర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. గతేడాది బిల్లులు అందకపోవడంతో ఈవిద్యాసంవత్సరంలో ఒక్క ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం కూడా నిర్వహించలేకపోయూరు. మిగతా అంశాల మాదిరిగానే ఇన్‌చార్జీల పాలనలో ఎన్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలు సైతం నీరుగారిపోతున్నాయని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు