ఎన్నికల విధుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి

14 Feb, 2016 01:05 IST|Sakshi
ఎన్నికల విధుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి

నారాయణఖేడ్ /పెద్దశంకరంపేట/పటాన్‌చెరు టౌన్:ఉప ఎన్నికల విధుల్లో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ హీరాసింగ్ రక్తపోటుకు గురై మరణించాడు. నారాయణఖేడ్ మండలం కొండాపూర్ పోలింగ్ కేంద్రం వద్ద పటన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే హీరాసింగ్ శనివారం ఎన్నికల విధులు నిర్వర్తించారు. మధ్యాహ్నం సమయంలో ఆయన తీవ్రమైన రక్తపోటుతో పాటు ఛాతీలో నొప్పితో బాధపడుతూ కుప్పకూలాడు. తోటి సిబ్బంది వెంటనే ఆయనను ఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. దీంతో మార్గమధ్య లో సంగారెడ్డి సమీపంలోకి వెళ్లగానే మరణించాడు. ఈ యన భౌతికకాయాన్ని సంగారెడ్డి ఆస్పత్రిలో ఉంచారు. హెడ్‌కానిస్టేబుల్ మృతి విషయం ఎన్నికల కమిషన్‌కు నివేదించామని, ప్రభుత్వం ద్వారా కుటుంబానికి సహా యం అందేలా చూస్తామని కలెక్టర్ రోనాల్డ్‌రాస్ తెలిపా రు. మృతుడు హీరాసింగ్‌ది పెద్దశంకరంపేట మండలం కోలపల్లి గ్రామం. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు.


 హీరాసింగ్ కుటుంబాన్ని ఆదుకుంటాం: కలెక్టర్
విధినిర్వహణలో ప్రాణాలు విడిచిన హీరాసింగ్ (48) కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, జిల్లా ఎస్పీ సుమతి, అడిషనల్ ఎస్పీ సురేందర్‌రెడ్డి శనివారం రాత్రి పరామర్శించారు. మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళలర్పించారు. ఎన్నికల విధులు పూర్తయ్యాయనే సంతోషంలో ఉన్న తమను హెడ్‌కానిస్టేబుల్ మృతి చెం దాడన్న వార్త కలిచివేసిందన్నారు. అయన కుటుం బాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. హీరాసింగ్ భార్య ప్రతిభ, కుమార్తె హారికలను ఓదార్చారు. వీరి వెంట మెదక్ డీఎస్పీ రాజారత్నం, అడిషనల్ డీఎస్పీ వెంకన్న, సీఐలు నాగయ్య, లింగేశ్వర్, పేట ఎస్‌ఐ మహేష్‌గౌడ్ తదితరులున్నారు.


 హెడ్ కానిస్టేబుల్ మృతితో విషాదం
ఖేడ్ ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం నారాయణఖేడ్‌లో పోలింగ్ బందోబస్తు నిర్వహిస్తూ హెడ్ కానిస్టేబుల్ హీరాసింగ్ మృతిచెందిన ఘటన విషాదాన్ని నిం పింది. 1959 బ్యాచ్‌లో ఉద్యోగం పొందిన హీరాసింగ్ ఆయా పోలీస్ స్టేషన్‌లలో పని చేశారు. ప్రస్తుతం కొంత కాలంగా పటాన్‌చెరు పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. పటాన్‌చెరులోని జేపీ కాలనీలో నివాసముంటున్నారు. ఆయనకు భార్య ప్రతిభాబాయి, పదోతరగతి చదువుతోన్న కూతురు హారిక ఉన్నారు. హీరాసింగ్ మృతి పట్ల పోలీసు అధికారుల సంఘం నాయకుడు ఆసిఫ్ సంతాపం ప్రకటించారు. స్థానిక పోలీసులు సంతాపం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు