జూన్‌ 2 నుంచి లాయర్లకు హెల్త్‌కార్డులు

6 May, 2018 01:17 IST|Sakshi

న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: న్యాయవాదుల సంక్షేమనిధి కోసం గతంలో కేసీఆర్‌ సర్కార్‌ కేటాయించిన రూ.వంద కోట్లపై వచ్చిన రూ.23 కోట్ల వడ్డీని న్యాయవాదుల సంక్షేమానికి వెచ్చి ంచాలని తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌ నిర్ణయించింది. శనివారం సచివాలయం లో న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన ట్రస్ట్‌ సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2న లాంఛనంగా న్యాయవాదులకు హెల్త్‌కార్డులు జారీ చేస్తామన్నారు.

అదేరోజు మూడు కీలక పథకాలను ప్రారంభిస్తామని చెప్పారు. న్యాయవాదికి రూ.2 లక్షల మేరకు ఆరోగ్య బీమా కల్పించాలని, ప్రమాదంలో మరణిస్తే ప్రమాద బీమా పథకం కింద కుటుంబసభ్యులకు రూ.10 లక్షల ఆర్థిక సా యం చేయాలని సమావేశం నిర్ణయించిందని చెప్పారు.  

మరిన్ని వార్తలు