వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు

10 Mar, 2015 19:56 IST|Sakshi

తెలంగాణ చైతన్యాన్ని కొనసాగించడం, జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా టీయూడబ్ల్యుజే ఏర్పడిందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. మంగళవారం వనస్థలిపురంలోని వనితా కళాశాలలో జరిగిన టీయూడబ్ల్యుజే ఎల్‌బీనగర్ నియోజకవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యుజే నియోజకవర్గ డైరీనీ ఆవిష్కరించి, యూనియన్ సభ్యులకు గుర్తింపు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 10 కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని, ముందు ముందు రూ.100 కోట్ల నిధిని ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. అక్రిడేషన్‌తో సంబంధం లేకుండా ఇచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడామని, త్వరలోనే హెల్త్ కార్డుల సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. అలాగే అర్హులైన అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇప్పించడానికి కృషి చేస్తున్నామన్నారు.

టీయూడబ్ల్యుజే రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్ మాట్లాడుతు ప్రజాస్వామ్య స్పూర్తి, విలువల నుంచి వచ్చిందే టీయూడబ్ల్యుజే అని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదని అన్నారు. హయత్‌నగర్ సమీపంలోని మునగనూరులో జర్నలిస్టుల ప్లాట్ల సమస్య పరిష్కారానికి యూనియన్ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు